Cryptocurrency: క్రిప్టోకరెన్సీలో భారత్‌ స్థానం ఎంతో తెలుసా...!

22 Aug, 2021 18:51 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ కొత్త రికార్డులను నమోదు చేస్తూనే ఉంది. పలు క్రిప్టోకరెన్సీలు భారీగా లాభాలను గడించాయి. బిట్‌కాయిన్‌ ఐతే ఏకంగా 50వేల డాలర్ల వరకు కూడా చేరుకుంది. ఒకానొక సమయంలో క్రిప్టోకరెన్సీ నేలచూపులు చూస్తూ ఇన్వెస్టర్లకు పీడకలనే మిగిల్చింది. ఈక్వెడార్‌, పనామా వంటి దేశాలు, ఎలన్‌ మస్క్‌, మార్క్‌ క్యూబాన్‌ వంటి దిగ్గజ బిలీయనీర్లు క్రిప్టోకరెన్సీకి మద్దతు పలకడం వంటి అంశాలు క్రిప్టోకరెన్సీకి ఎదుగుదలకు ఎంతగానో  ఉపయోగపడ్డాయి. 
చదవండి: China Stands With Taliban: తాలిబన్లతో చైనా దోస్తీ..! భారీ పన్నాగమేనా..!

తగ్గేదేలే అంటున్న భారతీయులు..!
క్రిప్టోకరెన్సీపై భారతీయులు ఎక్కువగానే ఇన్వెస్ట్‌చేస్తున్నారు. క్రిప్టోకరెన్సీ స్వీకరణ విషయంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. వియత్నాం క్రిప్టోకరెన్సీ స్వీకరణలో మొదటి స్థానంలో నిలిచింది. క్రిప్టోకరెన్సీ స్వీకరణ విషయంలో అమెరికా ఎనిమిదో స్థానంలో, చైనా పదమూడో స్థానంలో కొనసాగుతుండడం గమనార్హం. బ్లాక్‌చైన్ డేటా ప్లాట్‌ఫాం చైనాలిసిస్  కొత్త నివేదిక ప్రకారం భారత్‌ క్రిప్టోకరెన్సీను దత్తత తీసుకునే విషయంలో రెండో స్థానంలో కొనసాగుతున్నట్లు పేర్కొంది. చైనాలిసిస్‌ నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 154 దేశాల్లో క్రిప్టోకరెన్సీను గత సంవత్సరం కంటే ఎక్కువగా 881 శాతం స్వీకరిస్తున్నల్లు వెల్లడించింది. 2019 మూడవ త్రైమాసికం నుంచి క్రిప్టోకరెన్సీపై గ్లోబల్ అడాప్షన్ 2,300 శాతంగా పెరిగింది.

అభివృద్ధి చెందుతున్న దేశాలు యునైటెడ్ స్టేట్స్,  యూరోపియన్ దేశాల కంటే క్రిప్టోకరెన్సీను స్వీకరించడంలో ముందున్నాయి, పీర్-టు-పీర్  ప్లాట్‌ఫారమ్ ట్రేడింగ్ ద్వారా క్రిప్టోకరెన్సీ చలామణీలో నడుస్తోందని చైనాలిసిస్‌ నివేదిక వెల్లడించింది. రిజర్వ్‌ బ్యాంకు , కేంద్ర ప్రభుత్వ సూచనలను పట్టించుకోకుండా భారతీయులు క్రిప్టోకరెన్సీపై విపరీతంగా ఇన్వెస్ట్‌చేస్తున్నారు.

తాజాగా ఆర్థిక శాఖ మంతి​ నిర్మలా సీతారామన్‌ కేబినెట్‌ ముందు త్వరలోనే ప్రతిపాదిత క్రిప్టోకరెన్సీ బిల్లు ఎప్పుడు తెస్తారనే కుతుహాలంతో భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.  వాజిర్‌ ఎక్స్‌ వంటి క్రిప్టో ఎక్స్‌ఛేంజ్‌లలో యూజర్ సైన్-అప్‌లు మార్చి 2020 నుంచి గణనీయంగా 4937శాతం మేర పెరిగాయి , అయితే భారత తొలి క్రిప్టో యునికార్న్ కాయిన్‌డీసీఎక్స్‌ యూజర్ బేస్ ఈ సమయంలో దాదాపు 700 శాతం మేర  పెరిగింది.

యువతకు పోటీగా...
క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో భారత్‌ నుంచి  యువత భాగస్వామ్యం ఎక్కువగా  ఉంది. తాజాగా వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నివేదిక ప్రకారం  భారత్‌లో ఎక్కువగా 18 నుంచి 25 సంవత్సరాల వయసు గల యువతి, యువకులే ఎక్కువగా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్‌ చేస్తున్నారని చైనాలసిస్‌ పేర్కొంది. ఇప్పుడు ప్రస్తుతం 45 సంవత్సరాలు వయసు​ ఉన్న భారతీయులు కూడా క్రిప్టోకరెన్సీపై భారీగా ఇన్వెస్ట్‌చేస్తున్నారు. 

(చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్‌ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్‌...!)

మరిన్ని వార్తలు