రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, భారత్‌ వృద్ధికి ఇండియా రేటింగ్స్‌ కోత!

31 Mar, 2022 12:09 IST|Sakshi

ముంబై: భారత్‌ వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి అంచనాలకు ఇండియా రేటింగ్స్‌ కోత విధించింది. ఇంతక్రితం ఈ అంచనా 7.6 శాతంకాగా, తాజాగా 7 నుంచి 7.2 శాతం శ్రేణికి తగ్గిస్తున్నట్లు తాజా నివేదికలో పేర్కొంది.

 రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, వినియోగదారు సెంటిమెంట్‌ బలహీనత దీనికి కారణమని పేర్కొంది. క్రూడ్‌ ఆయిల్‌ ధరల తీవ్రత ఎకానమీపై కనబడుతుందని విశ్లేషించింది.  

ఇప్పుడే చెప్పడం కష్టం... చక్రవర్తి 
ఇదిలావుండగా, యుద్ధం ప్రభావం భారత్‌ ఎకానమీపై ఏ మేరకు ఉంటుందన్న విషయం ఇప్పడే చెప్పడం కష్టమవుతుందని ప్రముఖ ఆర్థికవేత్త పినాకి చక్రవర్తి పేర్కొన్నారు. పలు ప్రపంచ దేశాలకు ఇప్పుడు ధరల పెరుగుదల తీవ్రత సవాలుగా ఉందని అన్నారు.      


 

మరిన్ని వార్తలు