పబ్‌జీ లాభాల్లో భారత్‌ వాటా 1.2 శాతమే...

14 Sep, 2020 17:42 IST|Sakshi

ముంబై: దేశంలో పబ్‌జీ యాప్‌ నిషేధించినప‍్పటికీ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పబ్‌జీ మొబైల్ యాప్‌ 2018లో పారంభమైనప్పటి నుంచి యాప్‌ వినియోగదారులు 3.5 బిలియన్‌ డాలర్స్‌ ఖర్చు చేసినట్లు సెన్సార్‌ టవర్స్‌ అనే కంపెనీ వెల్లడించిన గణాంకాల్లో తేలింది. కేవలం ఈ ఏడాదిలోనే 19.8 కోట్ల డౌన్‌లోడ్‌లు కాగా... 1.8 బి.డా(180కోట్లు) సంపాధించడం విశేషం. అంతే కాదు గత 72 రోజుల్లో 50 కోట్ల డాలర్లు పబ్‌జీ యాప్‌ ఆర్జించింది. ఈ గణాంకాలు ఇదిలా ఉండగా, భారత దేశంలో ఇందుకు భిన్నంగా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా పబ్‌జీ యాప్‌ వినియోగదారుల్లో 24 శాతం మన దేశంలోనే ఉన్నారు. కానీ ఈ యాప్‌కు వచ్చే లాభాల్లో మన దేశం నుంచి కేవలం 1.2 శాతం మాత్రమే.  రాయల్‌ పాస్‌, రకరకాల రంగులు, ఇంకా యాప్‌లోని కొన్ని పరికరాలు కొనేందుకు మన దేశంలో ఉన్న పబ్‌జీ వినియోగదారులు ఎక్కువగా ఖర్చు చేయడానికి ఆసక్తి చూపట్లేదు. ఈ నెల 2న చైనాకు చెందిన 118 యాప్స్‌తో పాటు పబ్‌జీ కూడా నిషేధించిన విషయం తెలిసిందే.  దీన్ని ద్వారా ఈ యాప్‌ పబ్లిషర్‌ టెన్‌సెంట్‌ కంపెనీకి 34 బి.డా నష్టపోయింది.  

మన దేశంలో పబ్‌జీని గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి తొలగించారు.  ఇప్పుడు మన దేశంలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ లేదా అప్‌డేట్‌ చేయడం చట్ట విరుద్ధం. రెవెన్యూ పరంగా మన దేశంలో కొంత నిరాశగానే ఉన్నా, మళ్లీ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు పబ్‌జీ కార్పొరేషన్ తెలిపింది. ఈ వివాదాన్ని పరిశీలించి టెన్‌సెంట్‌ కంపెనీ నుంచి పూర్తి హక్కులు పొందినట్లు పేర్కొంది.  భారత్‌లో మళ్లీ పబ్‌జీని ప్రారంభించేందుకు స‍్వదేశీ బ్రాండ్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. (చదవండి: భారత్‌లో రీ ఎంట్రీకి పబ్‌జీ మాస్టర్‌ ప్లాన్)‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా