Dr. Devi Shetty: మదర్ థెరిసా వ్యక్తిగత వైద్యుడు.. రిచెస్ట్ డాక్టర్ - వైద్యరంగానికి తలమానికం!

8 May, 2023 21:36 IST|Sakshi

బిలీనియర్ అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది వ్యాపారవేత్తలే, కానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒక డాక్టర్ కూడా చోటు సంపాదించుకున్నారు. ఇంతకీ ఆయనెవరు? ఆయన సంపాదన ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

డాక్టర్ దేవి శెట్టి (Dr. Devi Shetty) అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. 'నారాయణ హృదయాల' మాత్రం దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. 1984లో మదర్ థెరిసాకి మొదటి సారి గుండెపోటు వచ్చినప్పుడు ఆమెను సంప్రదించిన డాక్టర్ దేవి శెట్టి ఆ తరువాత దాదాపు ఐదు సంవత్సరాలు ఆమె వ్యక్తిగత వైద్యుడిగానే ఉన్నారు.

ప్రముఖ కార్డియాక్ సర్జన్ అయిన దేవి శెట్టి బిలినియర్ మాత్రమే కాదు పరులకు ఉపకారం చేసే పరోపకారి కూడా. ఈయన 2001లో నారాయణ హృదయాలయను స్థాపించారు. ఆ తరువాత ఇది నారాయణ్ హెల్త్‌గా మారింది. ప్రస్తుతం ఇది 47 హెల్త్‌కేర్ సెంటర్‌లతో, రూ. 15,000 కోట్ల మార్కెట్ క్యాప్‌తో భారతదేశంలోని అతిపెద్ద హాస్పిటల్ చెయిన్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

'నారాయణ హృదయాల స్థాపించడం వెనుక మదర్ థెరిసా ఒక స్పూర్తిదాయకమైన శక్తి' అని ఒక కాలమ్‌లో రాసుకున్నట్లు సమాచారం. ఆమె పేద ప్రజలకు ఎలా సేవ చేసేదో అది చూసి తాను కూడా తన వంతు సేవ చేయాలనే సంకల్పంతో ఈ హాస్పిటల్ ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు.

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఒక గ్రామంలో జన్మించిన డాక్టర్ శెట్టి చిన్నతనంలోనే హార్ట్ సర్జన్ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణంగానే ఈ దిశవైపు అడుగులు వేస్తూ అనుకున్నది సాధించి 'హార్ట్ సర్జన్' అయ్యాడు. నిరంతర కృషితో దేశంలో ఆరోగ్య సంరక్షణకు గణనీయమైన కృషి చేసిన డాక్టర్ శెట్టి ఈ రోజు ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగాడు.

(ఇదీ చదవండి: కియా నుంచి మరో నయా కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?)

డాక్టర్ శెట్టి మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివి ఆ తరువాత యూకే, అమెరికాలో అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ విధానంలో గొప్ప అనుభవం పొందాడు. చదువు పూర్తయిన తర్వాత కార్డియాక్ సర్జన్‌గా ఉద్యోగం ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే ఈ రంగంపై ఆయనకున్న ఆసక్తి కారణంగా మరింత రాణించాడు.

(ఇదీ చదవండి: విడుదలకు ముందే బుకింగ్స్ షురూ.. లాంచ్ అయితే రచ్చ.. రచ్చే!)

ప్రస్తుతం భారతదేశంలో 30 కంటే ఎక్కువ ఆసుపత్రులతో 7,000 పడకలను కలిగి ఉన్న నారాయణ హృదయాల పేదలకు సరసమైన ధరలలోనే సేవలు అందిస్తూ తరిస్తోంది. భారతదేశంలో ఉన్న అతి గొప్ప డాక్టర్లలో ఒకరైన డాక్టర్ శెట్టి ఆస్తుల విలువ సుమారు రూ. 9,800 కోట్లు అని సమాచారం. ఈయన భారతదేశంలో అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్ కైవసం చేసుకున్నాడు. అంతే కాకుండా టైమ్ మ్యాగజైన్ చేత ఆరోగ్య సంరక్షణలో అత్యంత ప్రభావవంతమైన 50 మంది వ్యక్తులలో ఒకడుగా రికార్డు బద్దలు కొట్టాడు.

మరిన్ని వార్తలు