ఫెడ్‌ ఎఫెక్ట్‌: రుపీ ఢమాల్‌

17 Jun, 2021 16:26 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి భారీ పతనాన్ని నమోదు చేసింది. డాలరు మారకంలో 74.08 వద్ద స్థిరపడింది. ఏప్రిల్‌ 7 తరువాత ఇదే ఎక్కువ నష్టం. డాలర్ సూచిక 0.29శాతం  పెరిగి 91.39 కు చేరుకుంది. బుధవారం   రూపాయి  73.32 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.(బ్యాంక్స్‌, మెటల్‌ దెబ్బ: నష్టాల ముగింపు)

యుఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 33 పైసలు క్షీణించి 73.65 వద్దకు  ప్రారంభమైంది.  ఊహించిన దానికంటే  ముందుగానే యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచనుందన్న అంచనాల మధ్య డాలరువైపు ఇన్వెస్టర్ల పెట్టుబడులు మళ్లాయి.  ఈ నేపథ్యంలో రూపాయి బలహీనమైన నోట్తో ప్రారంభమైందని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్‌ తెలిపింది. మరోవైపు  బ్రెంట్ ముడి ఫ్యూచర్స్ బ్యారెల్కు 0.60శాతం  పడి73.94 డాలర్లకు చేరుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి ధరలు కూడా దిగి వచ్చాయి. ఇది ఇలా ఉంటే అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. చివరకు సెన్సెక్స్‌ 179 పాయింట్లు క్షీణించి 52323 వద్ద,నిఫ్టీ 76 పాయింట్లు పతనమై 15691 వద్ద ముగిసాయి.

చదవండి: కరోనా సంక్షోభం: గూగుల్‌ మరోసారి భారీ సాయం

మరిన్ని వార్తలు