amazon: అమెజాన్‌కు రెండో టెక్నాలజీ హబ్‌ భారత్‌

17 Sep, 2021 13:28 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అమెరికా తర్వాత భారత్‌ తమకు రెండో అతి పెద్ద టెక్నాలజీ హబ్‌గా మారిందని టెక్‌ దిగ్గజం అమెజాన్‌ కంట్రీ హెడ్‌ అమిత్‌ అగర్వాల్‌ తెలిపారు. 
దేశీయంగా తమ సంస్థలో ఇంజినీరింగ్, కంటెంట్‌ క్రియేషన్, మార్కెటింగ్‌ తదితర విభాగాల్లో సుమారు ఒక లక్ష మంది పైగా ప్రొఫెషనల్స్‌ పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

అమెజాన్‌ ఇండియా కెరియర్‌ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. ఈ ఏడాది దేశీయంగా 35 నగరాల్లో 8,000 మంది పైచిలుకు ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకోనున్నట్లు అగర్వాల్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు