సెప్టెంబర్‌లో 16,570 కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు

25 Oct, 2021 04:55 IST|Sakshi

ముంబై: దేశవాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో 16,570 కొత్త కంపెనీలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయని అధికారిక గణాంకాలు తెలిపాయి. తద్వారా దేశంలో ప్రస్తుతం కార్యకలాపాలను సాగించే(యాక్టివ్‌) కంపెనీల మొత్తం సంఖ్య 14.14 లక్షలకు చేరింది. కేంద్ర కార్పొరేట్‌ వ్యవవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఈ సెప్టెంబర్‌ 30వ తేది నాటికి దేశంలో మొత్తం 22,32,699 కంపెనీలు రిజి్రస్టేషన్‌ చేసుకున్నాయి. వీటిలో 7,73,070 కంపెనీలు మూతబడ్డాయి. 2,298 సంస్థలు క్రియాశీలకంగా పనిచేయడం లేదు. 6,944 కంపెనీలు దివాళ ప్రక్రియలో ఉన్నాయి. 36,110 కంపెనీలు వివిధ సమస్యలతో మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్‌లో కనిష్టంగా 3,209 కంపెనీలు రిజిస్ట్రేషన్లు జరిగాయని, నాటి నుంచి నెలవారీ కంపెనీల రిజిస్ట్రేషన్లు పెరుగుతూ వచ్చాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గతేడాది సెపె్టంబర్‌ రిజిస్ట్రేషన్లు 16,641 తో పోలిస్తే  తాజా సమీక్ష నెలలో రిజిస్ట్రేషన్లు తగ్గినా, ఈ ఏడాది ఆగస్ట్‌తో పోలిస్తే ఈ సంఖ్య 25 శాతం అధికంగా ఉంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు