ముడి పామాయిల్‌ దిగుమతి సుంకం కోత

26 Nov, 2020 20:10 IST|Sakshi

ముడి పామాయిల్‌ దిగుమతి సుంకం కోత

దిగిరానున్న వంట నూనెల ధరలు

37. 5 శాతంనుంచి 27.5 శాతానికి  తగ్గింపు

సాక్షి, న్యూఢిల్లీ: పెరుగుతున్న ఆహార ధరలను నియంత్రించేందుకు కేంద్రం కీలకనిర్ణయం తీసుకుంది.  ముడి పామాయిల్‌ (సీపీఓ) దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించింది. ఈ మేరకు గురువారం  ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. ముడి పామాయిల్‌ దిగుమతిపై ప్రస్తుతం వసూలు చేస్తున్న పన్నును 37.5 శాతం నుంచి భారత్‌  27.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పామాయిల్‌ను ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి చేసుకునేది భారత్. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుండి సంవత్సరానికి 9 మిలియన్ టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది.

మరిన్ని వార్తలు