డౌన్‌లోడ్ లో అగ్రస్థానంలో భారత్

20 Nov, 2020 12:32 IST|Sakshi

కోవిడ్ - 19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దింతో అందరూ ఇంట్లోనే ఉండేసరికి స్మార్ట్ ఫోన్, పీసీ, పియస్4, ఏక్షబాక్స్ వన్, నింటెండో స్విచ్, గూగుల్ స్టేడియా వంటి గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ వినియోగం చాలా వరకు పెరిగింది. తాజాగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభాలో మూడు బిలియన్లకు పైగా మంది ఏదో ఒక గేమ్ అడుతున్నారని పేర్కొంది. పోకీమాన్ గో, పబ్‌జి మొబైల్ వంటి ప్రసిద్ధ గేమ్ సంస్థలు లాక్డౌన్ సమయంలో స్టే-ఎట్-హోమ్ వంటి ఫీచర్లను కూడా ప్రవేశపెట్టాయి. 2020 మొదటి తొమ్మిది నెలల్లో గ్లోబల్ మొబైల్ గేమ్ డౌన్‌లోడ్‌లలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది.

మన దేశ పౌరులు 2020 మొదటి 9 నెలల్లో 7.3 బిలియన్ గేమ్ లను డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్త మొత్తం డౌన్‌లోడ్‌లలో ఇది దాదాపు 17% అని యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ పేర్కొంది. ఈ ఏడాది తోలి త్రైమాసికంలో భారతీయులు దాదాపు1.8 బిలియన్ గేమ్ లను ఇన్స్టాల్ చేసుకున్నారు. తరువాతి త్రైమాసికంలో మన దేశంలో లాక్ డౌన్ విధించడం వల్ల గేమ్ డౌన్లోడ్ 50% పెరిగాయి. దింతో గేమింగ్ ప్రియుల సంఖ్య భారిగా పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో గేమ్ డౌన్‌లోడ్‌లలో వృద్ధి 7% పెరిగి 2.9 బిలియన్ డౌన్‌లోడ్‌లకు చేరుకున్నాయి. ప్రపంచ వ్యాప్త గేమ్ డౌన్లోడ్ లలో 10శాతం ఇన్‌స్టాల్ లతో యుఎస్ రెండవ స్థానంలో నిలిచింది, 3వ స్థానంలో బ్రెజిల్ (8 శాతం) ఉంది. (చదవండి: కొత్త రికార్డు సృష్టించిన షియోమి)

2020 మొదటి 9 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన గేమ్ లలో గారెనా ఫ్రీ ఫైర్ మొదటి స్థానంలో నిలిచింది. తరువాత స్థానాలలో పబ్జి, సబ్వే సర్ఫర్‌ గేమ్ లు నిలిచాయి. ఇండియాలో అక్టోబరులో పబ్జి నిషేధం తర్వాత తిరిగి "పబ్జి మొబైల్ ఇండియా" పేరుతో రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన గేమ్ లలో ఇన్నర్‌స్లోత్స్ అమాంగ్ గేమ్ మొదటి స్థానంలో ఉంది. గత సంవత్సరంతో పోల్చితే గూగుల్ ప్లే డౌన్‌లోడ్‌లు మొదటి తొమ్మిది నెలల్లో 40% కంటే ఎక్కువ పెరిగాయి, అలాగే ఆపిల్ యొక్క యాప్ స్టోర్ ఇన్‌స్టాల్‌లు గత సంవత్సరంతో పోలిస్తే 16% పెరిగాయి.

మరిన్ని వార్తలు