పబ్జీ లవర్స్‌కు మరో షాక్‌, ఊపందుకున్న బ్యాన్‌ డిమాండ్‌

18 Jun, 2021 14:42 IST|Sakshi

త్వరలో విడుదల కానున్న పబ్జీ గేమ్‌ 

గేమ్‌ పై కమ్ముకున్న నీలినీడలు 

గేమ్‌ను బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ 

సాక్షి,వెబ్‌డెస్క్‌:పబ్జీ గేమింగ్‌ ప్రియులకు షాక్‌ తప‍్పదా? ఆ గేమ్‌కు అదిలోనే హంసపాదు ఎదురు కానుందా?పబ్‌జీ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) పేరుతో విడుదల కానున్న..ఈ గేమ్‌ అసలు విడుదలవుతుందా? విడుదలైన ఎంతవరకు మనుగడ సాధిస్తుందనేది తాజా పరిణామాలతో ప్రశ్నార్ధకంగా మారింది. 

కొద్ది రోజుల క్రితం తెలంగాణ బీజేపీ ఎంపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమాచార సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాధ్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో టెన్సెంట్ సంస్థకు చెందిన పబ్‌జీ గేమ్, క్రాఫ్టన్ సంస్థకు చెందిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా మధ్య ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.  

తాజాగా సీఏఐటీ (ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ సమాఖ్య) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ కు వివిధ పార్టీల నేతలు కలిశారు. చైనా గేమ్‌పై నిషేదం విధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ తరుణంలో బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా "భారత సార్వభౌమత్వానికి, దేశ భద్రతకు ముప్పు మాత్రమే కాదు, యువ తరాలకు హానికరం. గతేడాది నిషేదించిన పబ్జీ ఇప్పుడు భారత చట్టాల్ని అధిగమించి దొడ్డిదారిన ఎంట్రీ ఇస్తోందని  ప్రవీణ్ ఖండేల్వాల్ ట్వీట్‌ చేశారు. 

దీనిపై పలువురు నెటిజన్లు తమదైన స్టైల్లో అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. పబ్జీ గేమ్‌ను బ్యాన్‌ చేయాలని నాడు కేంద్రానికి లేఖ రాసిన అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే నినోంగ్ ఎరింగ్ నుంచి తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్‌ పాటు  పలు పార్టీల నేతలు బీజీఎంఐ గేమ్‌ను  నిషేధించాలని  డిమాండ్‌  చేశారు.  అయితే ప్రస్తుత నిబంధనల రీత్యా ప్రభుత్వం క్రాఫ్టన్‌ గేమ్‌ బ్యాన్‌ అంశాన్ని పట‍్టించుకునే అవకాశం లేదని అంటున్నారు. 

ఎందుకంటే..? క్రాఫ్టన్‌కు చెందిన ఈ గేమ్‌పై నిషేధం విధిస్తారా? లేదా అనే అంశంపై పలువురు కేంద‍్ర ప్రభుత్వాన్ని ఆర్టీఐ చట్టం కింద అడిగారు. అందుకు ప్రభుత్వం బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్‌ను ముందస్తుగా నిషేధించలేమని ధృవీకరించింది. అదే సమయంలో క్రాఫ్టన్ సంస్థ దక్షిణ కొరియాలోని సియోల్‌లోని భారత రాయబార కార్యాలయానికి చెందిన అధికారులతో  గేమ్‌ ప్రారంభంపై చర్చించారు. ఒప్పందం ప్రకారం 100మిలియన్ల పెట్టుబడి పెట్టారు. త్వరలో ప్రారంభమయ‍్యే ఈ గేమ్‌ తాజా పరిణాలతో విడుదలవుతుందా? నిషేదానికి గురవుతుందా? అనేది కాలమనే నిర్ణయించాలి.     

చదవండి: BGMI ఆడాలంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే, లేదంటే బ్లాక్ చేస్తారు

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు