జీ20 దేశాలకు యూపీఐ, ఆధార్‌!

11 Oct, 2022 15:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అందరికీ డిజిటల్‌ సేవలు అందించేందుకు వీలుగా.. జీ 20 దేశాలు యూపీఐ, ఆధార్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేసి, అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ప్రోత్సాహక విభాగం కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు. విజ్ఞానం, ఆవిష్కరణ, స్థిరత్వం అన్నవి నూతనతరం ఆర్థిక వృద్ధి చోదకాలుగా పేర్కొన్నారు.

భారత్‌ ఓపెన్‌ సోర్స్‌ ప్లాట్‌ ఫామ్‌లు అయిన కోవిన్, ఆధార్, యూపీఐ ఇంటర్‌ఫేస్‌ తదితర వాటిని సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో జైన్‌ మాట్లాడుతూ. ఈ తరహా ఓపెన్‌ సోర్స్‌ (మార్పులకు వీలైన), పలు వ్యవస్థల మధ్య పనిచేసే ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేయడంపై జీ20 దేశాలు దృష్టి సారించాలని సూచించారు. 

చదవండి: మూడేళ్ల సీక్రెట్‌ బయటపడింది.. స్వయంగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్న సీఈఓ!

మరిన్ని వార్తలు