70 కోట్ల చదరపు అడుగులకు గిడ్డంగులు

16 Dec, 2022 10:22 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గిడ్డంగులు, సరుకు రవాణా కేంద్రాల స్థలం 2030 నాటికి రెండింతలై 70 కోట్ల చదరపు అడుగులకు చేరుతుందని సీబీఆర్‌ఈ నివేదిక తెలిపింది. ‘ఈ–కామర్స్, థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్, ఇంజనీరింగ్, తయారీ రంగాల నుంచి డిమాండ్‌ ఇందుకు కారణం. ఎనమిదేళ్లలో పరిశ్రమకు రూ.1.66 లక్షల కోట్ల నిధులు కావాలి.

ఈ నిధుల్లో అధిక మొత్తం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అవసరం అవుతుంది. గ్రేడ్‌–ఏ స్థలం వాటా ప్రస్తుతం ఉన్న 35 నుంచి 2030 నాటికి 50 శాతానికి చేరనుంది. పరిశ్రమలో దేశవ్యాప్తంగా 2022 జనవరి–సెప్టెంబరులో రూ.1,194 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చా యి. ఏప్రిల్‌–జూన్‌తో పోలిస్తే సెప్టెంబర్‌ త్రైమాసికంలో లీజింగ్‌ స్థలం 40 శాతం అధికమై 92 లక్షల చదరపు అడుగులు నమోదైంది. మూడు త్రైమాసికాల్లో 2.2 కోట్ల చదరపు అడుగుల స్థలం లీజ్‌కు ఇచ్చారు.‍

చదవండి: ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్‌ డిమాండ్‌, అవే కావాలంటున్న ప్రజలు!

మరిన్ని వార్తలు