40 ఏళ్లకే తరగనంత సంపద

14 Oct, 2021 06:19 IST|Sakshi

చిన్న వయసులోనే వ్యాపార విజేతలు

ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ జాబితా విడుదల

న్యూఢిల్లీ: వయసులో ఉన్నప్పుడే వేలాది కోట్లు కూడబెట్టుకోవడం ఎలాగో.. ‘ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా 40, అండర్‌ సెల్ఫ్‌మేడ్‌ రిచ్‌లిస్ట్‌ 2021’ను పరిశీలిస్తే తెలుస్తుంది. 40 ఏళ్లలోపే రూ.1,000 కోట్లకు పైగా సంపదను సమకూర్చుకున్న వ్యాపార విజేతలతో ఈ జాబితాను హురూన్‌ ఇండియా బుధవారం విడుదల చేసింది. భారత్‌లో జని్మంచిన వ్యాపారవేత్త, మీడియా డాట్‌ నెట్‌ వ్యవస్థాపకుడు, 39 ఏళ్ల దివ్యాంక్‌ తురాఖియా రూ.12,500 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత బ్రౌజర్‌స్టాక్‌ సహ వ్యవస్థాపకులు నకుల్‌అగర్వాల్‌(38), రితేష్‌ అరోరా(37), చెరో రూ.12,400 కోట్ల విలువతో రెండో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు.

ఈ జాబితాలో మొత్తం 45 వ్యాపారవేత్తలకు స్థానం లభించింది. ఇందులో 42 మంది భారత్‌లో నివసిస్తున్నారు. జాబితాలో 31 మంది కొత్తవారే ఉన్నారు. ఇందులోనూ 30 మంది స్టార్టప్‌లతో సంపద సృష్టించుకున్నారు. బెంగళూరు ఎక్కువ మందికి ఆశ్రయమిచి్చంది. జాబితాలో 15 మంది ఈ నగరంలోనే నివసిస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ 8 మంది, ముంబై 5, గురుగ్రామ్‌ 3, థానె ఇద్దరికి చొప్పున నివాస కేంద్రంగా ఉంది. సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సేవలు (12 మంది), రవాణా అండ్‌ లాజిస్టిక్స్‌ (5 మంది), రిటైల్‌ (5 మంది), ఎంటర్‌టైన్‌మెంట్‌ (5 మంది), ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగం నుంచి 5 మంది చొప్పున ఇందులో ఉన్నారు. డిస్కౌంట్‌ బ్రోకరేజీలో దిగ్గజంగా ఉన్న జెరోదా వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు. ఆయన సంపద రూ.11,100 కోట్లుగా ఉంది. భారత్‌ మొత్తం మీద సంపన్నుల్లో చూస్తే కామత్‌ కుటుంబం 63వ స్థానంలో ఉంది. 2021 సెపె్టంబర్‌ 15 నాటి గణాంకాలను ఈ జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకున్నారు.  

ఈకేఐ ఎనర్జీ వ్యవస్థాపకుడికీ చోటు..
ఇటీవలే ఐపీవోను విజయవంతంగా ముగించుకున్న ఈజ్‌మైట్రిప్‌ వ్యవస్థాపకులు రికాంత్‌ పిట్టి (33), నిశాంత్‌ పిట్టి (35), ప్రశాంత్‌ పిట్టి (37) జాబితాలోకి చేరారు. బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్‌ అయిన ఈకేఐ ఎనర్జీ వ్యవస్థాపకుడు మనీష్‌ కుమార్‌ దబ్‌కర (37) కూడా ఇందులో ఉన్నారు. ఈ జాబితాలోని సంపన్నులు అందరూ ఉమ్మడిగా రూ.1,65,600 కోట్లు కూడబెట్టుకున్నారు. గతేడాది జాబితాలో నిలిచిన వారి సంపదతో పోల్చి చూస్తే 286 శాతం వృద్ధి కనిపిస్తోంది. భారత్‌పేకు చెందిన 23 ఏళ్ల శశ్వత్‌ నక్రాని జాబితాలో అత్యంత పిన్న వయసు్కడిగా నిలవడం గమనార్హం.

మరిన్ని వార్తలు