Suv Cars: రెండేళ్లైన వెయిట్‌ చేస్తాం.. ఎస్‌యూవీ కార్లకు క్రేజ్‌.. ఎందుకో తెలుసా!

17 Jul, 2022 21:45 IST|Sakshi

భారత ఆటోమొబైల్‌ రంగంలో కార్ల హవా కొనసాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు వ్యక్తిగత ప్రయాణించడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో భారతీయులు ఎస్‌యూవీ కార్లు వైపు అడుగులేస్తున్నారు. అందుకు నిదర్శనమే గత ఐదేళ్లలో 36 ఎస్‌యూవీ మోడళ్లు మార్కెట్లో విడుదల కావడంతో పాటు విజయవంతంగా అమ్మకాలలోనూ జోరు ప్రదర్శిస్తోంది.

ఎస్‌యూవీ క్రేజ్‌ తగ్గేదేలే
సేఫ్టీ, కంఫర్ట్‌తో పాటు స‌న్‌రూఫ్‌, టెక్నాల‌జీ క‌నెక్టెడ్ ఫీచ‌ర్ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ తరహా  పాపుల‌ర్ మోడ‌ల్ కార్ల కోసం కొన్ని సార్లు రెండు సంవత్సరాలు వ‌ర‌కూ వేచి చూస్తున్నారు కూడా. ప్రస్తుతం ఎస్‌యూవీలకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. గతంలో హ్యాచ్‌బ్యాక్‌లు సేల్స్ చార్ట్‌లలో ఆధిపత్యం చెలాయించేవి, కానీ ఎంట్రీ-లెవల్,  మిడ్-సైజ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUV) ఇటీవల కాలంలో జనాదరణ ఎక్కువ పొందుతున్నాయి.

మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాల్లో ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్ అమ్మకాలలో వృద్ధిని సాధిస్తోంది. పరిశ్రమలో దాదాపు 19 శాతం ఉన్న ఎస్‌యూవీ విభాగం 2021-22లో 40 శాతానికి పెరిగింది. దీని బట్టి ఆ వాహనాల అమ్మకాలు వాటికున్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని తెలిపారు. 

గ‌తేడాది 30.68 ల‌క్ష‌ల కార్లు అమ్ముడైతే వాటిలో ఎస్‌యూవీల వాటా 6.52 ల‌క్ష‌ల యూనిట్లు. గ‌త ఐదేండ్ల‌లో మార్కెట్‌లో కంపాక్ట్‌, మిడ్ సైజ్ ఎస్‌యూవీ కార్లే ఎంట‌ర్ కావ‌డం ఆశ్చ‌ర్య‌మేమీ కాదు.  నూత‌న శ్రేణి ఎస్‌యూవీ కార్ల ప‌ట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను అర్థం చేసుకున్నాక కార్ల త‌యారీ సంస్థ‌లు అటువైపు దృష్టి మ‌ళ్లించారంటున్నారు. 2016-17లో సేఫ్టీ ఫీచ‌ర్లు గ‌ల కార్లు 17 శాతం అమ్ముడైతే.. 2021-22లో 24 శాతానికి పెరిగింది. ఇటీవ‌ల మార్కెట్లో మారుతి బ్రెజా మోడ‌ల్ కారు లాంచ్‌ చేస్తే.. మొత్తం వివిధ కార్ల బుకింగ్స్‌లో 70 శాతం దానివే ఉన్నాయి. ఎస్‌యూవీల‌తోపాటు క‌స్ట‌మ‌ర్ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా కార్ల‌ను తేవ‌డంతో మార్కెట్‌లో మూడో స్థానానికి టాటా మోటార్స్‌ దూసుకొచ్చింది.

చదవండి: Elon Musk: కోర్టులో విచారణ వాయిదా కోరిన ఎలాన్ మస్క్‌.. ఏం ప్లాన్‌ వేశావయ్యా!

మరిన్ని వార్తలు