కోవిడ్‌ ఎఫెక్ట్‌: కంపెనీల్లో కొత్త రకం మోసాలు

16 Nov, 2022 07:17 IST|Sakshi

న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా దేశీయంగా 95 శాతం కంపెనీలు కొత్త రకం మోసాలను ఎదుర్కొంటున్నాయి. డిజిటల్‌ సెక్యూరిటీ, ఉద్యోగుల భద్రత, తప్పుడు సమాచారంపరమైన రిస్కులతో సతమతమవుతున్నాయి. కోవిడ్‌ విజృంభణ, దానివల్ల తలెత్తిన అనిశ్చితి, తదనంతరం డిజిటల్‌.. రిమోట్‌ పని విధానాలకు మళ్లాల్సి రావడం మొదలైన అంశాలు ఈ పరిస్థితికి దారి తీశాయి. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ నిర్వహించిన సర్వేలో ఇవి వెల్లడయ్యాయి.

దీని ప్రకారం 52 శాతం భారతీయ కంపెనీలు గత 24 నెలల్లో ఏదో ఒక మోసం లేదా ఆర్థిక నేరం బారిన పడ్డాయి. 95 శాతం కంపెనీలు కోవిడ్‌–19 మూలంగా వచ్చిన మార్పుల వల్ల కొత్త రకం మోసాల బారిన పడినట్లు నివేదిక పేర్కొంది. దుష్ప్రవర్తన రిస్కు (67 శాతం), లీగల్‌ రిస్కు (16 శాతం), సైబర్‌ క్రైమ్‌ (31 శాతం), ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ (19 శాతం), ప్లాట్‌ఫాం రిస్క్‌ (38 శాతం) విభాగాల్లో ఇవి తలెత్తినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 1,296 కంపెనీలు, భారత్‌లో 112 సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. భారత్‌లో కంపెనీలు మోసాలను నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు కొంత సత్ఫలితాలను ఇస్తున్నాయని సర్వే పేర్కొంది.

చదవండి: కేం‍ద్రం భారీ షాక్‌: పది లక్షల రేషన్‌ కార్డులు రద్దు, కారణం ఏంటంటే..

మరిన్ని వార్తలు