ఫ్రెషర్లకు అదిరిపోయే శుభవార్త..! వచ్చే  నెల నుంచి..

22 Mar, 2022 19:38 IST|Sakshi

భారత కంపెనీలు భారీ ఎత్తున​ ఫ్రెషర్ల నియామాకాలను చేపట్టేందుకు సిద్దంగా ఉ‍న్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో పెద్ద ఎత్తున్న నియామాకాలను జరిపేందుకు కంపెనీలు సిద్దంగా ఉ‍న్నాయని మ్యాన్‌ పవర్‌ గ్రూప్‌ ఎంప్లాయిమెంట్‌ ఔట్‌లుక్‌ సర్వే వెల్లడించింది. 

38 శాతంపైగా..!
వచ్చే మూడు నెలల్లో 38 శాతం కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయని సర్వేలో తేలింది. సుమారు 3090 కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్దంగా ఉన్నాయి. మరోవైపు త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే మాత్రం నియామకాలు 11 శాతం క్షీణించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.

ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో తమ ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని 55 శాతం, తగ్గొచ్చని 17 శాతం, నియామాకాల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చునని 36 శాతం కంపెనీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. మొత్తంగా చూస్తే 38 శాతం కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకునేందుకు సిద్దంగా ఉ‍న్నట్లు తేలింది. 

వీడని భయాలు..!
కరోనా రాకతో పలు కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. కోవిడ్‌ ఉదృతి కాస్త తగ్గడంతో కంపెనీలు కొత్త ఉద్యోగుల నియమాకాలపై దృష్టి సారించాయి.  అయినప్పటీకి తాజా పరిస్థితులు కంపెనీల్లో భయాలను సృష్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ వార్‌, అధిక ద్రవ్యోల్భణాల నుంచి కంపెనీలకు పెను సవాళ్లు ఎదురుకానున్నాయని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఎండీ సందీప్‌ గులాటి తెలిపారు.  

బలంగా భారత స్టార్టప్‌ వ్యవస్థ..!
భారత్‌లో స్టార్టప్‌ వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది. స్టార్టప్‌ కంపెనీలకు భారత్‌ అనువైన దేశంగా మారినట్లు సందీప్‌ గులాటీ అభిప్రాయపడ్డారు. బలమైన స్టార్టప్‌ వ్యవస్థను రూపొందించేందుకు గాను కేంద్రం కూడా భారీ ఫండ్‌ను కేటాయిస్తున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్‌లో సుమారు రూ.283.5 కోట్ల "స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇక ఉద్యోగాల్లో మహిళల వాటా ఇంకా ఆందోళకరంగానే ఉందని సర్వే తెలిపింది. అత్యధికంగా ఐటీ, సాంకేతికరంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండగా, తరువాత రెస్టారెంట్లు-హోటళ్లు, విద్య, వైద్యం, సామాజిక-ప్రభుత్వ రంగాల్లో నియామాకాలు అధికంగా ఉంటాయని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ సర్వే వెల్లడించింది. 

చదవండి: జర్మనీ అతి పెద్ద సంస్థ ఇన్ఫోసిస్‌ కైవసం.. డీల్‌ విలువ ఎంతంటే?

మరిన్ని వార్తలు