Covid Effect: ఎంత ఖర్చయినా పర్వాలేదు.. ఆరోగ్యం కావాలి!

22 Feb, 2022 20:05 IST|Sakshi

వినియోగదారుల్లో మారిన ధోరణి 

ఆరోగ్యకరమైన ఆహారం, ఉత్పత్తులకు ప్రాధాన్యం 

ఈవై ఇండియా సర్వే వెల్లడి 

Effect Of Corona: కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యం కోసం మరింత ఎక్కవగా ఖర్చు పెట్టేందుకు వినియోగదారులు ఏ మాత్రం వెనుకాడడం లేదు. శారీరక, మానసిక ఆరోగ్యం దృఢంగా ఉండేందుకు శిక్షణ, సహజసిద్ధమైన ఆహారం, ఔషధాలు, ప్రత్యేకమైన ఆహర మెనూ కోసం ఖర్చు చేస్తున్నారు. కరోనా మహమ్మారి ఈ రకమైన మార్పునకు కారణమని ఈవై ఇండియా ‘ద సన్‌రైజ్‌ కన్జ్యూమర్‌ హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్‌ సెక్టార్‌’ నివేదిక తెలియజేసింది.  

  • 94 శాతం మంది భారతీయులు తమ కుటుంబ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయంగా ఇది 82 శాతంగానే ఉంది.  
  • ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరోనా మహమ్మారి వెళ్లిపోయిన తర్వాత కూడా కొనసాగుతుందని 52 శాతం మంది భారతీయలు సర్వేలో తెలిపారు. అంతర్జాతీయంగా చూస్తే ఇలా చెప్పిన వారు 39 శాతంగా ఉన్నారు.  
  • భారతీయులు ఇంటి చిట్కాలు, పరిష్కారాలకు, ఆరోగ్యకరమైన ఆహారానికి  ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆధునిక ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదం, హెర్బల్‌ ఔషధాలే పరిష్కారమని భావిస్తున్నారు. 
  • ఆయుర్వేద ఉత్పత్తులకు డిమాండ్‌ పెరగడంతో ఇప్పటికే ఈ రంగంలో పనిచేస్తున్న కంపెనీలకు ప్రోత్సాహకరంగా మారింది.   
  • ఆరోగ్యాన్నిచ్చే ఉత్పత్తులకు అధికంగా ఖర్చు పెట్టేందుకు తాము సుముఖమని 40 శాతం మంది తెలిపారు. అంతర్జాతీయంగా ఇలా 29 శాతం మందే చెప్పారు.  
  • ఈవై ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌ ఇండెక్స్‌ (2021 నవంబర్‌) ఆధారంగా, అంతర్జాతీయంగా 16,000 మంది, భారత్‌ నుంచి 1,002 మంది అభిప్రాయాలను సర్వే కింద పరిగణనలోకి తీసుకున్నారు.  

పెద్ద ఎత్తున మార్పు
 ‘‘కొంత మంది ఇది స్వల్పకాలమేనని భావిస్తున్నారు. కానీ, మేము మాత్రం వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రత, ఫిట్‌నెస్‌ విషయంలో వినియోగదారుల ధోరణిని ఈ దశ పెద్ద ఎత్తున మార్పును తీసుకొస్తుందని, వేగవంతం చేస్తుందని భావిస్తున్నాం’’ అని ఈవై ఇండియా నేషనల్‌ లీడర్‌ అన్షుమన్‌ భట్టాచార్య తెలిపారు. 

(చదవండి: భారీగా పడిపోతున్న క్రిప్టో కరెన్సీ ధరలు..!)

మరిన్ని వార్తలు