వామ్మో! భారతీయుల వాడకం మామూలుగా లేదుగా, క్రెడిట్‌ కార్డ్‌లతో వేల కోట్ల!

25 May, 2022 19:50 IST|Sakshi

దేశంలో క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారుల సంఖ్య రోజు రోజుకీ రాకెట్‌ వేగంతో పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా కారణంగా ఆన్‌లైన్‌ వినియోగం పెరగడం, అదే సమయంలో కొనుగోళ్లు సైతం ఊహించని స్థాయిలో ఉన్నట్లు తేలింది.  


ఆఫ్‌లైన్‌ కంటే ఆన్‌లైన్‌లోనే ఎక్కువ
ఇటీవల ఇండియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌, ఆర్బీఐలు విడుదల చేసిన నివేదికలో పెద్దమొత్తంలో ఫ్యాన్సీ ప్రొడక్ట్‌లను క్రెడిట్‌ కార్డ్‌లతో కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. ఎంతలా అంటే మార్చి నెల నాటికి దేశీయ క్రెడిట్‌ కార్డ్‌ యూజర్లు యావరేజ్‌గా ఆఫ్‌లైన్‌లో స్వైప్‌ చేయడం కంటే ఆన్‌లైన్‌లో కొనుగోలు కోసం రెండు శాతం కంటే ఎక్కువగా స్పెండ్‌ చేస్తున్నారు. ఒక్క మార్చిలో 7.3 కోట్ల మంది క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్లు ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై రూ. 68,327 కోట్లు ఖర్చు చేస్తే  పీవోఎస్‌ మెషిన్లలో స్వైపింగ్‌ చేయడం ద్వారా ఖర్చు చేసింది రూ. 38,377 కోట్లు.

పే లేటర్‌ 
నివేదిక ప్రకారం..సగటు క్రెడిట్ కార్డ్ లావాదేవీ విలువ రూ.9,600 కాగా, డెబిట్ కార్డ్‌ల విలువ కేవలం రూ. 3,900గా ఉంది. డెబిట్‌ కార్డ్‌లపై తక్కువ సమయాన్ని వెచ్చిస్తున్న యూజర్లు..క్రెడిట్‌ కార్డ్‌లపై 21 కంటే ఎక్కువ సార్లు టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నారు. దీంతో యాజవరేజ్‌గా యూజర్లు క్రెడిట్‌ కార్డ్‌తో నెలకు రూ.14,500 కొనుగోళ్లు చేస్తుంటే..డెబిట్‌ కార్డ్‌పై కేవలం రూ.700 మాత్రమే ఖర్చు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు