జులైలో ముడి చమురు ఉత్పత్తి తగ్గింది

25 Aug, 2021 08:45 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి జులైలోనూ క్షీణించింది. గతేడాది(2020) ఇదే నెలతో పోలిస్తే 3.2 శాతం తగ్గి 2.5 మిలియన్‌ టన్నులకు పరిమితమైంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ లక్ష్యాన్ని అందుకోలేకపోవడం ప్రభావం చూపింది. 

ఈ ఏడాది(2021–22) తొలి 4 నెలల్లో సైతం దేశీ చమురు ఉత్పత్తి 3.4 శాతం నీరసించి 9.9 మిలియన్‌ టన్నులకు చేరింది. పెట్రోలియం, సహజవాయు శాఖ విడుదల చేసిన గణాంకాలివి. గత నెలలో ఓఎన్‌జీసీ 4.2 శాతం తక్కువగా 1.6 మిలియన్‌ టన్నుల చమురును వెలికి తీసింది. ఇక ఏప్రిల్‌–జులై మధ్య 4.8 శాతం క్షీణించి 6.4 మిలియన్‌ టన్నులకు పరిమితమైంది. అయితే నేచురల్‌ గ్యాస్‌ ఉత్పత్తి పుంజుకుంది.

చదవండి : Flipkart: కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్‌ 

మరిన్ని వార్తలు