ప్రైవేట్‌ ఉద్యోగులకు పండగే, ఈ ఏడాది భారీగా పెరగనున్న జీతాలు!

17 Jan, 2023 20:53 IST|Sakshi

భారతీయ ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది ఏసియా దేశాల్లో భారత్‌కు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగులకు జీతాలు 15 శాతం నుంచి 30 శాతం పెరగనున్నట్లు కార్న్ ఫెర్రీ నివేదిక తెలిపింది. సౌత్‌ ఏసియన్‌ దేశాల్లో  పనిచేస్తున్న ఉద్యోగుల సగటు వేతనం ఈ ఏడాది 9.8 శాతం పెరగనుండగా.. అదే యావరేజ్‌ శాలరీ గతేడాది 9.4శాతం ఉందని తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా లైఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ, హెల్త్‌ కేర్‌ రంగాలకు చెందిన ఉద్యోగుల యావరేజ్‌ శాలరీ 10శాతం కంటే ఎక్కువ పెరగనున్నట్లు హైలెట్‌ చేసింది. 

818 కంపెనీలు..8లక్షల ఉద్యోగుల జీతాలను 
కార్న్ ఫెర్రీ దేశ వ్యాప్తంగా 818 కంపెనీల్లో పనిచేస్తున్న 8లక్షల మంది ఉద్యోగులు, 61శాతం సంస్థలు ఉద్యోగులకు చెల్లించే జీతాలను పరిగణలోకి తీసుకొని ఏ దేశంలో, ఏ రంగంలో ఎంతెంత శాలరీలు పెరుగుతున్నాయనేది స్పష్టం చేసింది. 

శాలరీ పెంచే అంశంలో భారత్‌ ముందంజ
ఆ లెక్కన భారత్‌లో ఉద్యోగుల యావరేజ్‌ శాలరీ 9.8శాతం పెరగనుండగా..ఆస్ట్రేలియాలో 3.5శాతం, చైనాలో 5.5శాతం, హాంగ్‌కాంగ్‌ 3.6శాతం, ఇండోనేషియాలో 7శాతం, కొరియాలో  4.5 శాతం, మలేషియాలో 5శాతం, న్యూజిల్యాండ్‌లో 3.8శాతం, ఫిలిప్పీన్స్‌లో 5.5శాతం, సింగపూర్‌లో 4శాతం, థాయిల్యాండ్‌లో 5శాతం, వియాత్నంలో 8శాతంగా పెరగనున్నాయి. 

60శాతం కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే మొగ్గు
టైర్ 1 నగరాలుగా పిలువబడే ప్రధాన మెట్రోపాలిటన్ కేంద్రాల్లోని ఉద్యోగులు అధిక వేతనం పొందుతున్నట్లు కార్న్ ఫెర్రీ తెలిపింది.  హైబ్రిడ్, రిమోట్ వర్కింగ్ వంటి కొత్త వర్క్‌ కల్చర్‌ పుట్టుకొని రావడంతో.. 60 శాతం కంపెనీలు ఉద్యోగుల్ని ఇంటి వద్ద నుంచే పనిచేయిస్తున్నాయి.  

చదవండి👉 'జీతం తక్కువైతే పిల్లను కూడా ఇవ్వరు!'

మరిన్ని వార్తలు