స్విస్‌ బ్యాంకుల్లో.. మనోళ్ల సంపద ఎంతో తెలిస్తే..

17 Jun, 2022 14:37 IST|Sakshi

స్విస్‌ బ్యాంకుల్లో ఇండియన్స్‌  సంపద 2020లో దాదాపు మూడు రెట్లు  పుంజుకుంది

2021లో సంపద 50 శాతం జంప్‌

2021 నాటికి 30వేల కోట్ల  రూపాయలు

టాప్‌లో యూకే, అమెరికా

44వ స్థానంలో భారత్

సాక్షి, న్యూఢిల్లీ: స్విస్‌ బ్యాంకు భారతీయులు దాచిపెట్టిన సంపద గణనీయంగా పెరిగింది. వరుసగా రెండో ఏడాది కూడా భారీగా పుంజు కున్నాయి.  భారతీయలు,  కంపెనీలు, పెట్టుబడులు,హోల్డింగ్స్‌  విలువ 14 ఏళ్ల గరిష్టానికి  చేరుకున్నాయి.  2020 ముగింపు నాటికి  స్విస్ బ్యాంకుల్లోని నిధులు దాదాపు మూడు రెట్లు పెరిగి 2.55 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 20,700 కోట్లు)గా ఉండటం గమనార్హం.

స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, కంపెనీల ద్వారా 2021లో 83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (రూ.30,626 కోట్లకు) పెరిగాయని స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో గురువారం వెల్లడించింది. సెక్యూరిటీలు, సంస్థాగత హోల్డింగ్స్ గణనీయంగా పెరిగాయని స్విస్ బ్యాంకు ధృవీకరించింది.

దీని ప్రకారం మొత్తం స్విస్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో (239 బ్యాంకులు) కస్టమర్ డిపాజిట్లు 2021లో దాదాపు 2.25 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు పెరిగాయి. ఫారిన్ క్లయింట్స్ ఫండ్స్ కు సంబంధించిన జాబితాలో భారత్ 44వ స్థానంలో ఉండగా యూకే, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. యూకే 379 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్. 168 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌గా ఉన్నాయి. ఆ తరువాత వెస్టిండీస్, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, హాంగ్‌కాంగ్, లక్సెంబర్గ్, బహమాస్, నెదర్లాండ్స్, కైమన్ ఐలాండ్స్, సైప్రస్  దేశాలు టాప్‌లో ఉన్నాయి.
 
కాగా స్విస్ బ్యాంకుల్లో మనవాళ్ల సంపద 2006లో గరిష్టంగా 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌గా నమోదయ్యాయి. కానీ 2018లో 11శాతం, 2017లో 44 క్షీణించాయి. అలాగే 2019 చివరి నుంచి కస్టమర్ డిపాజిట్లు పడిపోయాయని  బ్యాంకు తెలిపింది. అయితే  2011, 2013, 2017, 2020, 2021లో ఈ ట్రెండ్ రివర్స్ అయింది.  స్విస్‌ బ్యాంకులకు తరలిపోతున్న  భారతీయుల సంపద క్రమేపీ పెరుగుతూ వస్తోంది.  

మరిన్ని వార్తలు