అమ్మ బాబోయ్‌.. యూట్యూబ్‌ నుంచి మనోళ్లు అంత సంపాదిస్తున్నారా!

4 Mar, 2022 17:09 IST|Sakshi

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో యూట్యూబ్​ అంటే తెలియని వారుండరు. సామాన్యులను సైతం సెలబ్రిటీలుగా మార్చడం యూట్యూబ్‌కే చెల్లింది. ప్రత్యేకంగా లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి దీని వాడకం బాగా పెరిగిందనే చెప్పాలి. కొందరైతే ఉన్న ఉద్యోగాలను సైతం వదులుకునే యూట్యూబ్‌లో కంటెంట్‌ను క్రియేటర్‌గా కొంతమంది, నటులుగా మరి కొంతమంది ఇలా తమలోని సత్తాను చాటుతున్నారు. అలా కంటెంట్​ క్రియేట్ చేసి మన యూట్యూబర్లు ఏకంగా రూ. 6,800 కోట్లు సంపాదించారట. వినడానికి షాక్‌ అనిపించినా నమ్మాలి మరీ.. 

2020 సంవత్సరంలో మన ఎకానమీకి ఇంత మొత్తం ఆదాయం వచ్చిందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ అనే స్వతంత్ర కన్సల్టింగ్ సంస్థ ఈ రిపోర్టు వెల్లడించింది.  అంతేకాకుండా  మన దేశంలో యూట్యూబ్​ ప్రభావం ఆర్థికంగానూ, సామాజికంగానూ, కల్చరల్​గా ఎలా ఉందనే అంశాలని ఈ కన్సల్టింగ్​సంస్థ స్టడీ చేసింది. మన జీడీపీకి రూ. 6,800 కోట్లు తేవడమే కాకుండా, 6,83,900 ఫుల్​ టైమ్‌తో సమానమైన​ఉద్యోగాలను కూడా యూట్యూబ్ ఇచ్చిందని ఆ నివేదిక తెలపింది.

భారతదేశంలో 1,00,000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లతో ఉన్న ఛానెల్‌ల సంఖ్య ఇప్పుడు 40,000 వద్ద ఉన్నట్లు, ఇవి సంవత్సరానికి 45% కంటే ఎక్కువ వృద్ధిని సాధిస్తున్నట్లు తెలిపింది. యూట్యూబ్‌ సృష్టికర్తలు తమ కంటెంట్‌తో డబ్బు సంపాదించేందుకు ఎనిమిది విభిన్న మార్గాలను ఇందులో పొం‍దుపరిచారు. వీటిని ఉపయోగించుకుంటూ కనీసం లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే యూట్యూబ్‌ ఛానెల్‌ల సంఖ్య సంవత్సరానికి 60% పైగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు