Google Chrome: ప్రమాదంలో గూగుల్‌ క్రోమ్‌ యూజర్లు..కేంద్రం హెచ్చరిక, వెంటనే ఇలా చేస్తే మేలు!

21 Aug, 2022 15:44 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ యూజర్లకు భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌( సీఈఆర్‌టీ-ఇన్‌)హెచ్చరికలు జారీ చేసింది. ఎంపిక చేసిన కంప్యూటర్లపై మాల్వేర్‌ సాయంతో భారీ ఎత్తున దాడులు జరిగే అవకాశం ఉందని తెలిపింది.  

గూగుల్‌ క్రోమ్‌ యూజర్లు 104.0.5112.101కి ముందు వెర్షన్‌లను వినియోగిస్తున్న గూగుల్‌ క్రోమ్‌ వినియోగదారులు ఈ దాడులకు ప్రభావితం అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే మాల్వేర్‌కు చిక్కకుండా ఉండేలా బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేయాలని సలహా ఇస్తున్నారు. 

కేంద్రం ఏం చెబుతోంది
సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఆర్‌టీ విభాగం ప్రతినిధులు దేశానికి చెందిన యూజర్ల కంప్యూటర్లలో గుర్తుతెలియని మాల్వేర్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ మాల్వేర్‌ సాయంతో సైబర్‌ నేరస్తులు సెలెక్టెడ్‌ కంప్యూటర్లు లేదంటే నెట్‌ వర్క్‌ గ్రూప్‌కు చెందిన కంప్యూటర్లను వారి ఆదీనంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఆ పీసీ, ల్యాప్‌ట్యాప్‌లలో ఉన్న డేటా దొంగిలించడం, ఆ దొంగిలించిన డేటాను డార్క్‌ వెబ్‌లో అమ్మి సొమ్ము చేసుకోవడంతో పాటు యూజర్లు మరింత ఇబ్బందులు పెట్టేలా మాల్వేర్‌ను స్ప్రెడ్‌ చేస్తారని సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు.

ముఖ్యంగా ఫెడ్‌సీఎం, స్విఫ్ట్‌ షేర్‌, ఏంజెల్‌,బ్లింక్‌, సైన్‌ ఇన్‌ఫ్లో వంటి ఫ్రీ సాఫ్ట్‌ వేర్‌లను ఉపయోగించే యూజర్లు మరింత ప్రమాదమని తెలిపింది. అందుకే ఆన్‌లైన్‌లో ఫ్రీగా లభ్యమయ్యే సాఫ్ట్‌వేర్‌ల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఆర్‌టీ-ఇన్‌ ఈ సందర్భంగా పలు జాగ్రత్తలు చెప్పింది.

మరిన్ని వార్తలు