పెను ప్రమాదంలో ఐఫోన్‌, యాపిల్‌ ఉత్పత్తులు..! హెచ్చరికలను జారీ చేసిన కేంద్రం..!

20 Mar, 2022 21:01 IST|Sakshi

ఇటీవల ఐఫోన్లతో పాటుగా పలు యాపిల్‌ ఉత్పత్తులపై కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది యాపిల్‌. ఈ అప్‌డేట్‌తో పలు ఫీచర్స్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ప్రధానంగా ఫేస్‌ మాస్క్‌ అన్‌లాక్‌ను ఐఫోన్, ఐపాడ్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. కాగా తాజాగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సైబర్-సెక్యూరిటీ వింగ్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) యాపిల్ డివైజ్లను వాడుతున్న వినియోగదారులందరూ వీలైనంత త్వరగా తమ డివైజ్‌లను అప్‌డేట్ చేయాలని కోరుతూ హెచ్చరిక జారీ చేసింది.

హ్యాకర్ల చేతిలోకి..!
యాపిల్‌ ఉత్పత్తుల్లో భద్రత లోపాలు ఉన్నట్లు సెర్ట్‌-ఇన్‌ గుర్తించింది. దీంతో యాపిల్‌ ఉత్పత్తులను హ్యకర్లు సులువుగా అపరేట్‌ చేసే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఆయా యూజర్ల సున్నితమైన సమాచారాన్ని సులువుగా యాక్సెస్‌ చేసేందుకు అనుమతిస్తాయని సెర్ట్‌-ఇన్‌ హెచ్చరించింది. 


మెమొరీ ప్రారంభ సమస్య, ఔట్‌ ఆఫ్‌ బౌండ్‌ రీడ్‌ అండ్‌ రైట్‌, మెమరీ కరప్షన్, సెన్సిటివ్ ఇష్యూ టైప్‌, యూజ్‌ ఆఫ్టర్‌ ఫ్రీ, నల్‌ పాయింటర్ డిరిఫరెన్స్, అథనిటికేషన్‌ సమస్య, కుకీ మేనేజ్‌మెంట్ , వ్యాలిడేషన్‌ ఇష్యూ, బఫర్ ఓవర్‌ఫ్లో, మెమరీ యూజ్‌ , యాక్సెస్ ప్రాబ్లమ్‌ వంటి భద్రతా లోపాలు కనుగొన్నామని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పేర్కొంది. ఈ భద్రతా లోపాల కారణంగా యాపిల్​ ప్రొడక్ట్స్​పై సైబర్​ అటాక్​ జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

అప్‌డేట్‌ చేయాల్సినవి

Apple iOS,iPadOS ఉత్పత్తుల్లో 15.4 కంటే పాత వెర్షన్‌

Apple WatchOS ఉత్పత్తుల్లో 8.5 కంటే పాత వెర్షన్‌

 Apple TV  15.4 కంటే పాత వెర్షన్‌

 Apple macOS Monterey 12.3 కంటే పాత వెర్షన్‌

యాపిల్ మాకోస్ కాటాలినా వెర్షన్‌ కంటే పాత వెర్షన్‌

చదవండి: ఫైర్‌ఫాక్స్‌ యూజర్లకు కేంద్రం భారీ అలర్ట్.. వెంటనే బ్రౌజర్ అప్‌డేట్ చేయండి?

మరిన్ని వార్తలు