నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..! ఐటీ కంపెనీల్లో కొలువుల జాతర..! 

24 Nov, 2021 18:25 IST|Sakshi

Indian IT Services to hire about 450,000 people in H2FY22 UnearthInsight: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..! వచ్చే ఏడాది ఐటీ కంపెనీల్లో కొలువుల జాతర మొదలుకానుంది. కోవిడ్‌-19 ఉదృత్తి తగ్గడంతో ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలో నియామకాలను చేపట్టనున్నట్లు మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ అన్‌ఎర్త్ ఇన్‌సైట్‌ ఒక నివేదికలో పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఐటీ కంపెనీలు సుమారు 4.5 లక్షల నియామకాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐటీ ఉద్యోగుల అట్రిషన్‌ రేట్‌ కూడా అధికంగానే ఉంది. దీంతో వారి స్థానంలో సుమారు 1.75 లక్షల ఉద్యోగాలను ఐటీ కంపెనీలు భర్తీ చేయనున్నట్లు అన్‌ఎర్త్‌ ఇన్‌సైట్‌ వెల్లడించింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌లోని టాప్‌-30 కంపెనీలు ఇప్పటికే 2.5 లక్షల ఫ్రెషర్స్‌కు అవకాశాలను కల్పించినట్లు అన్‌ఎర్త్‌ ఇన్‌సైట్‌ పేర్కొంది. వీటిలో ఫ్రెషర్‌లను నియమించిన టాప్ కంపెనీలలో టీసీఎస్‌ 77వేలు, ఇన్ఫోసిస్ 45వేలు, కాగ్నిజెంట్ 45వేలు,హెచ్‌సీఎల్‌ టెక్ 22వేల ఉద్యోగాలను కల్పించాయి. భారత టెక్‌ కంపెనీలు ముఖ్యంగా ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే ప్రోగ్రామ్‌పై దృష్టిసారించినట్లుగా తెలుస్తోంది. 
చదవండి: ఉద్యోగుల కోసం క్యాబిన్లు, ఇకపై ట్రైన్‌లలో ఆఫీస్‌ వర్క్‌ చేసుకోవచ్చు

అట్రిషన్‌ రేట్‌ కూడా ఎక్కువే...!
FY22లో అట్రిషన్‌ రేట్‌ 17-19 శాతంగా ఉండగా..అది వచ్చే FY23లో 16-18 శాతం ఉంటుందని అన్‌ఎర్త్‌ ఇన్‌సైట్‌ అభిప్రాయపడింది. కాగా ఐటీ కంపెనీలు వీరి స్ధానాల్లో కొత్త నియాకాలను  భర్తీ చేసే అవకాశం లేకపోలేదని తన నివేదికలో పేర్కొంది.  
   ​   
క్లౌడ్‌ సర్వీసులకే అధిక ప్రాధాన్యం..!
పలు దిగ్గజ ఐటీ కంపెనీలు క్లౌడ్‌ సర్వీస్‌లపై ఎక్కువగా ఫోకస్‌ చేసినట్లు తెలుస్తోంది. 2030 నాటికి క్లౌడ్‌ ఆధారిత సర్వీసుల విలువ ఏకంగా 80-100 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు అన్‌ఎర్త్ ఇన్‌సైట్‌ వెల్లడించింది. క్లౌడ్ ఇండస్ట్రీ, సెక్యూరిటీలో చాలా బలమైన రెండంకెల వృద్ధిని నమోదు చేసిన యాక్సెంచర్ వంటి కంపెనీలు భవిష్యత్తులో క్లౌడ్‌ ఆధారిత సేవలకు నాయకత్వం వహించనున్నట్లు పేర్కొంది. ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని కూడా ప్రాథమికంగా డిజిటల్,  క్లౌడ్ సేవలపై పనిచేయనున్నట్లు తెలుస్తోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్... అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఎడబ్ల్యుఎస్) బిజినెస్ యూనిట్‌ కోసం ఏకంగా పదివేల నియామకాలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 
చదవండి: వ్యాక్సినేషన్‌ మస్ట్‌! నో చెప్తున్న ఉద్యోగులు.. వర్క్‌ఫ్రమ్‌హోం పొడగింపునకు డిమాండ్‌!

మరిన్ని వార్తలు