మహిళలు అమితంగా ఇష్టపడే యాప్స్‌ ఏంటో తెలుసా?

15 Apr, 2023 20:22 IST|Sakshi

మొబైల్ వినియోగ పోకడలు, భారతీయ వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న ఆలోచనలను విశ్లేషిస్తూ 2022- 2023 డేటా ఆధారంగా భారతీయ మహిళలు, పురుషుల అభిరుచులపై ప్రముఖ బొబ్బల్‌ ఏఐ (Bobble AI) అనే కీ బోర్డ్‌ సంస్థ నివేదికను విడుదల చేసింది.

అందులో మహిళలు స్మార్ట్‌ ఫోన్‌లలో ఎక్కువగా ఆహారం, మెసేజింగ్‌ యాప్స్‌ను అమితంగా ఇష్టపడతున్నారని, మగవారు ఫోన్‌లలో గేమింగ్‌ యాప్స్‌ను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తన నివేదికలో పేర్కొంది. 

దేశ వ్యాప్తంగా 85 మిలియన్ల ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ల డేటా ఆధారంగా బొబ్బల్‌ ఏఐ ఈ సర్వేను వెలుగులోకి తెచ్చింది. ఇక ఆ రిపోర్ట్‌లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్‌లపై వెచ్చించే సమయం 50 శాతం పెరిగింది. ఉద్యోగం చేసే మహిళల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లు కేవలం 11.3శాతమే జరుగుతున్నాయని హైలెట్‌ చేసింది. మహిళలు, పురుషులు ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడేందుకు మక్కువ చూపిస్తున్నారని, వారిలో 6.1శాతం మంది మహిళలు గేమ్స్‌ ఆడడంలో యాక్టీవ్‌గా ఉన్నట్లు తెలిపింది. 

ఇక వివిధ యాప్స్‌ వినియోగంలోనూ మహిళలు వెనకబడినట్లు తెలుస్తోంది. ఏయే యాప్స్‌ను ఎంత శాతం ఉపయోగిస్తున్నారో ఒక్కసారి గమనిస్తే.. వాటిలో కమ్యూనికేషన్‌ అప్లికేషన్లు (apps) 23.3శాతం, వీడియో అప్లికేషన్లు 21.7 శాతం, ఫుడ్‌ అప్లికేషన్లు 23.5 శాతం ఉన్నాయి.

మగవారితో పోలిస్తే పేమెంట్‌ అప్లికేషన్‌లు 11.3శాతం, గేమింగ్‌ అప్లికేషన్లు 6.1 శాతం తక్కువగా ఉపయోగిస్తున్నారు. కాగా, మొబైల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ విభాగం ‘గోప్యత-అనుకూల’ పద్ధతిలో 85 మిలియన్ల కంటే ఎక్కువ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లను కవర్ చేసే ఫస్ట్ పార్టీ డేటాను ఉపయోగించి పరిశోధన చేసినట్లు బొబ్బల్‌ ఏఐ నివేదిక పేర్కొంది.

చదవండి👉 ఉద్యోగులకు షాకిస్తున్న కంపెనీలు.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు!

మరిన్ని వార్తలు