ఇండియన్‌ మోటార్‌సైకిల్‌ ‘చీఫ్‌’

28 Aug, 2021 12:16 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న ఇండియన్‌ మోటార్‌సైకిల్‌ సరికొత్త చీఫ్‌ శ్రేణి మోటార్‌సైకిల్స్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.20.75 లక్షల నుంచి ప్రారంభం.

2022 చీఫ్‌ శ్రేణిలో చీఫ్‌ డార్క్‌ హార్స్, ఇండియన్‌ చీఫ్‌ బాబర్‌ డార్క్‌ హార్స్, ఇండియన్‌ సూపర్‌ చీఫ్‌ లిమిటెడ్‌ మోడల్స్‌ ఉన్నాయి. 1,890 సీసీ ఎయిర్‌ కూల్డ్‌ ఇంజన్‌ పొందుపరిచారు. 15.1 లీటర్‌ ఫ్యూయల్‌ ట్యాంక్, ప్రీలోడ్‌ అడ్జెస్టేబుల్‌ రేర్‌ షాక్స్, డ్యూయల్‌ ఎగ్జాస్ట్, ఎల్‌ఈడీ లైటింగ్, కీలెస్‌ ఇగ్నిషన్, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్, సర్క్యులర్‌ టచ్‌ స్క్రీన్‌ రైడ్‌ కమాండ్‌ సిస్టమ్‌ వంటి హంగులు ఉన్నాయి. 

చదవండి : ఎలక్ట్రిక్‌ బైక్‌ ఐడియా..భలే ఉంది కదూ!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు