టెక్నాలజీ సాయంతో చమురు చోరీ, నిఘాకు ఐవోసీ డ్రోన్లు

26 Aug, 2021 09:17 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేలాది కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న చమురు పైప్‌లైన్ల భద్రతకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) డ్రోన్లను రంగంలోకి దింపింది. ఢిల్లీ– పానిపట్‌ మార్గంలో 120 కిలోమీటర్ల పైప్‌లైన్‌పై నిఘా కోసం డ్రోన్‌ సేవలను ప్రారంభించింది. చమురు దొంగతనాలను నిరోధించడమే కాకుండా, ప్రమాదాలను అరికట్టడం కోసం టెక్నాలజీ వినియోగం అవసరమని సంస్థ భావిస్తోంది.

15,000 కిలోమీటర్ల పరిధిలో సంస్థకు పైపులైన్లు విస్తరించి ఉండగా.. వీటిల్లో లీకేజీలను గుర్తించేందుకు ఇప్పటికే ఎంతో అత్యాధునిక టెక్నాలజీలను వినియోగిస్తోంది. ఇప్పుడు పైపులైన్ల పర్యవేక్షణకు డ్రోన్ల సేవలను కూడా వినియోగించుకోనున్నట్టు ఐవోసీ అధికారులు తెలిపారు. టెక్నాలజీ సాయంతో చమురు చోరీకి సంబంధించి 2020–21లో 34 ప్రయత్నాలను అడ్డుకున్నట్టు, 53 మందిని అరెస్ట్‌ చేసినట్టు చెప్పారు. మరోవైపు ఆప్టికల్‌ఫైబర్‌ ఆధారిత పైపులైన్‌ ఇంట్రూజర్‌ డిటెక్షన్‌ అండ్‌ వార్నింగ్‌ సిస్టమ్‌ (పీఐడీడబ్ల్యూఎస్‌)ను ఐవోసీ 5,474 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేస్తోంది.

చదవండి : మొబైల్‌ ఫోన్‌ ఎగుమతులు మూడు రెట్లు

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు