గ్రీన్‌పవర్‌ దిశగా అడుగులు వేస్తున్న ఐవోసీఎల్‌..!

26 Jul, 2021 22:47 IST|Sakshi

ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ తన రిఫైనరీ కేంద్రాలలో గ్రీన్‌ పవర్‌ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. పలు రిఫైనరీ కేంద్రాల్లో గ్రీన్‌ పవర్‌తో ఫ్యూయోల్‌ ఎక్స్‌పన్షన్‌ చేయనుంది. గ్రీన్‌ పవర్‌ను ఉపయోగించడం ద్వారా ఉద్గారాలను తగ్గించేందుకు కంపెనీ ప్రయత్నిస్తుందని ఐవోసీఎల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2023-24 నాటికి సుమారు 500,000 బ్యారెల్‌ పర్‌ డేకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రీన్‌ పవర్‌ను ఉపయోగించడంతో కొన్ని భాగాల మానుఫ్యాక్చరింగ్‌లో డీకార్బోనైజ్ చేయడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.  

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మధుర శుద్ధి కర్మాగారంలో 1.6 లక్షల బీపీడీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను నిర్మించాలని ఐవోసీఎల్‌ యోచిస్తోంది. కాగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌  రాజస్థాన్‌లో పవన విద్యుత్ ప్రాజెక్టును కలిగి ఉంది. విద్యుద్విశ్లేషణ ద్వారా పూర్తిగా గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసి మథుర శుద్ధి కర్మాగారానికి ఉపయోగించనున్నట్లు పేర్కొంది. 

సౌర, పవనశక్తి వంటి పునరుత్పాదాకాలను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ వాడకంతో రిఫైనరీలో ఉపయోగించే కార్బన్-ఉద్గార ఇంధనాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రిఫైనింగ్‌,ఇంధన రిటైలింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయనుందని తెలిపింది.  వచ్చే పదేళ్లలో ఐవోసిఎల్‌ హైడ్రోజన్,  ఎలక్ట్రిక్ మొబిలిటీపై దృష్టి సారిస్తుందని కంపెనీ ప్రతినిధి  వైద్య చెప్పారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు