ఇండియన్‌ ఆయిల్‌ కొత్త మస్కట్‌ ఇదే?

4 Sep, 2021 16:25 IST|Sakshi

ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ తమ కంపెనీని ప్రతిబింబించేలా కొత్త మస్కట్‌ని రూపొందించింది. శక్తికి, ధృడత్వానికి పేరైన ఖడ్గమృగాన్ని తమ కంపెనీ మస్కట్‌గా ఎంచుకుంది. ఏదైనా ఈవెంట్‌, లేదా బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం మస్కట్‌లను ఎంచుకోవడం సర్వ సాధారణం. ఇటీవల వెలుగులోకి వచ్చిన అస్సాం ఆయిల్స్‌ లిమిటెడ్‌ సంస్థ మస్కట్‌ను ఏర్పాటు చేసుకుంది. అదే బాటలో ఇండియన్‌ ఆయిల్‌ సైతం మస్కట్‌ని ట్విట్టర్‌ వేదికగా లాంఛ్‌ చేసింది.

ఇండియల్‌ ఆయిల్‌ కొత్తగా మాస్కట్‌ని లాంఛ్‌ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మస్కట్‌లను విడుదల చేయడంపకై ఉన్న శ్రద్ధ పెట్రోలు, డీజిల్‌ రేట్ల తగ్గింపుపై పెడితే బాగుంటుందంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు.

చదవండి : Petrol,diesel: రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు

మరిన్ని వార్తలు