ఇండియన్‌ ఆయిల్‌ మెగా ప్లాంట్‌

2 Nov, 2021 04:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) భారీ స్థాయిలో మలీక్‌ అన్‌హైడ్రైడ్‌ ప్లాంట్‌ను రూ.3,681 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. పాలిస్టర్‌ రెసిన్స్, సర్ఫేస్‌ కోటింగ్స్‌ ప్లాస్టిసైజర్స్, అగ్రోకెమికల్స్, లూబ్రికెంట్‌ అడిటివ్స్‌ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకై హర్యానాలోని పానిపట్‌ వద్ద ఉన్న సంస్థకు చెందిన రిఫైనరీ, పెట్రోలియం కాంప్లెక్స్‌ వద్ద ఈ కేంద్రాన్ని స్థాపించనుంది. 54 నెలల్లో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఏటా 1,20,000 టన్నుల తయారీ సామర్థ్యంతో ఇది రానుంది.  

మరిన్ని వార్తలు