టాప్‌ అమెరికా ఎంఎన్‌సీ సీఈవోగా ఇండో అమెరికన్‌ బిజినెస్ ఎగ్జిక్యూటివ్

17 Mar, 2023 16:30 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతీయ సంతతికి చెందిన బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌  మరో టాప్‌  ఇంటర్నేషనల్‌ కంపెనీ కీలక ఎగ్జిక్యూటివ్‌గా నియమితులయ్యారు. అమెరికాలోని దిగ్గజ మల్టీ నేషనల్‌ కంపెనీ హనీవెల్‌ ఇంటర్నేషనల్‌ కొత్త సీఈఓగా విమల్‌ కపూర్‌ ఎంపికయారు. ప్రస్తుత సీఈవీ  డారియస్‌ ఆడమ్జిక్‌  స్థానంలో కంపెనీ బాధ్యతలు స్వీకరిస్తారు.

57 ఏళ్ల కపూర్ ఏడాది జూన్‌ 1 నుంచి బాధ్యతలు చేపడతారని కంపెనీ ప్రకటించింది. అలాగే ఈ నెల(మార్చి)  13 నుంచి హనీవెల్‌  డైరెక్టర్ల బోర్డులో  కూడా చేరతారని తెలిపింది తెలిపింది. విమల్‌ కపూర్‌ ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్‌, సీవోవోగా సేవలందిస్తున్నారు. పనిచేస్తున్నారు. అలాగే  డారియస్‌ ఆడమ్జిక్‌  కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొనసాగుతారని హనీవెల్‌ స్పష్టం చేసింది. 2018లో ఛైర్మన్‌గా, 2017లోసీఈవోగా నియమితులైన  ఆడమ్జిక్‌ నేతృత్వంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 88 బిలియన్‌ డాలర్ల నుంచి 145 బిలియన్లకు డాలర్లకు పెరగడం విశేషం.

పాటియాలాలోని థాపర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో స్పెషలైజేషన్‌తో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యారు. ఇండియాలో స్టడీ పూర్తి చేసిన తర్వాత కంపెనీలో చేరిన విమల్‌ అనేక కీలక పదవులను నిర్వహించారు. నిర్మాణ సాంకేతికతలతో పాటు పనితీరు మెటీరియల్స్ అండ్‌ టెక్నాలజీ యూనిట్ల సీఈవోగా సేవలందించారు. వైవిధ్యభరిత తయారీదారుల వివిధ వ్యాపారాలకు నాయకత్వం వహించిన విమల్ కపూర్‌కు మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. హనీవెల్  సీఈవోగా నియమితులైన దాదాపు 10 నెలల తర్వాత  మరో కీలక పదవికి ప్రమోట్‌ అయ్యారు.  అమెరికన్‌ లిస్డెడ్‌ కంపెనీహనీవెల్‌ ఇంటర్నేషనల్‌.. ఏరోస్పేస్‌, బిల్డింగ్‌ టెక్నాలజీస్‌, పెర్‌ఫార్మెన్స్‌ మెటీరియల్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌, సేఫ్టీ అండ్‌ ప్రొడక్టివిటీ సొల్యూషన్స్‌ వ్యాపారాలను నిర్వహిస్తోంది

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు