ఐఓబీ రుణ రేటు పెంపు

9 Jul, 2022 02:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు– ఎంసీఎల్‌ఆర్‌ను స్వల్పంగా పెంచింది. అన్ని కాలపరిమితులపై ఈ రేటు  10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెరిగినట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

10వ తేదీ నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణ రేటుకు ప్రధానంగా ప్రామాణికంగా ఉండే ఏడాది రుణ రేటు 7.45% నుంచి 7.55%కి చేరింది. రెండు, మూడు సంవత్సరాల ఎంసీఎల్‌ఆర్‌ 7.55% కి చేరింది. ఓవర్‌నైట్‌ నుంచి ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 6.95 నుంచి 7.50% శ్రేణిలో ఉన్నాయి.  

మరిన్ని వార్తలు