హాట్ కేకుల్లా డెస్క్ టాప్‌ సేల్స్‌!! భార‌త్‌లో కింగ్ మేక‌ర్ ఎవ‌రంటే!

26 Feb, 2022 15:09 IST|Sakshi

కోవిడ్ కార‌ణంగా నిర్వ‌హిస్తున్న ఆన్‌లైన్ క్లాసులు, వ‌ర్క్ ఫ్ర‌మ్హోమ్ తో దేశంలో ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్లు (పీసీ-డెస్క్టాప్‌),ల్యాప్‌ట్యాప్‌ల వినియోగం బాగా పెరిగిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన క్యూ4 ఫ‌లితాల్లో దేశీయంగా ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్లు 14.8 మిలియ‌న్ యూనిట్ల షిప్ మెంట్ జ‌రిగిన‌ట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిపింది. 1.3 మిలియ‌న్ యూనిట్ల షిప్‌మెంట్‌తో హెచ్‌పీ సంస్థ మార్కెట్‌లో కింగ్ మేక‌ర్‌గా నిలిచింది.  

2020నుంచి హెచ్‌పీ భార‌త్‌లో 58.7శాతం వృద్ధితో 31.5శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండ‌గా..2021లో వాణిజ్య విభాగంలో హెచ్‌పీ మార్కెట్ వాటా 57.5శాతం నుంచి 60.1శాతానికి వృద్ధి చెందింది. వినియోగం విభాగాల్లో 30శాతం నుంచి 32.9శాతానికి పెరిగింది. 

క్యూ4లో వరుసగా రెండో త్రైమాసికంలో 1మిలియన్ యూనిట్లకు పైగా షిప్పింగ్ చేస్తూ 23.6శాతం షేర్‌తో డెల్ దేశీయ మార్కెట్‌లో రెండో స్థానంలో నిలించింది. ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ నుండి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో డెల్ 38శాతం వాటాతో ఎంటర్‌ప్రైజ్ విభాగంలో ముందుంది.

మ‌రో టెక్ సంస్థ లెనోవో పీసీ సెగ్మెంట్‌లో 22.8శాతం వృద్ధిని సాధించింది. 24.7శాతం వాటాతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎస్ఎంఈ) విభాగం నుండి డిమాండ్ పెర‌గ‌డంతో లెనోవో..,హెచ్‌పీ కంటే మందంజ‌తో రెండవ స్థానంలో ఉంది.  

ఏస‌ర్‌ 8.2శాతం, ఆసుస్ 5.9శాతం మార్కెట్ వాటాతో నాలుగు, ఐదవ స్థానాల్ని సంపాదించుకున్నాయి. డెస్క్‌టాప్ విభాగంగాలో ఏస‌ర్‌ అతిపెద్ద లబ్ధిదారుగా ఉంది. ఇది 25.8శాతం మార్కెట్ వాటా ఉంది.

ఆసుస్ సంవత్సరానికి 36.1శాతం వృద్ధి చెందింది.  

ఈ సంద‌ర్భంగా ఐడీసీ ఇండియా సీనియర్ మార్కెట్ అనలిస్ట్ (పీసీ డివైజెస్) భరత్ షెనాయ్ మాట్లాడుతూ వ‌రుస‌గా రెండో సంవ‌త్స‌రం సైతం విద్యార్ధుల‌కు ఆన్‌లైన్ క్లాసుల్ని నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో స్మార్ట్‌ఫోన్‌లు/టాబ్లెట్‌లను ఉప‌యోగిస్తున్నారు. వారిలో కొంత‌మంది విద్యార్ధులు మాత్రం పెద్దస్క్రీన్, వాడుకలో సౌలభ్యం వంటి ఇత‌ర ప్ర‌యోజ‌నాల కార‌ణంగా ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల‌ను వినియోగిస్తున్న‌ట్లు చెప్పారు.

>
మరిన్ని వార్తలు