మహిళా ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌ న్యూస్‌.. ఇకపై రైళ్లలో వారికోసం..

18 Sep, 2022 17:55 IST|Sakshi

భారతీయ రైల్వే.. ప్రతీ రోజు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తూ ప్రజలతో విడదీయరాని బంధం ఏర్పరుచుకుంది. తక్కువ ఖర్చుతో ప్రయాణమే గాకా వివిధ సేవలను ప్యాసింజర్లకు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం మహిళల కోసం రైల్వేశాఖ పెద్ద ప్రకటనే చేసింది. మహిళలు ఇకపై రైలులో సీటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ తెలిపింది. బస్సు, మెట్రో తరహాలో ఇకపై భారతీయ రైళ్లలో మహిళలకు ప్రత్యేక సీట్లను రిజర్వ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
 

మహిళలకు ప్రత్యేకంగా సీటు రిజర్వ్
సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మహిళల కోసం.. భారతీయ రైల్వే ప్రత్యేక బెర్త్‌లను కేటాయించనున్నారు. దీంతో పాటు మహిళల భద్రతకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రైళ్లలో మహిళల సౌకర్యార్థం రిజర్వ్ బెర్త్‌ల ఏర్పాటుతో పాటు అనేక సౌకర్యాలను ప్రారంభించినట్లు తెలిపారు.

స్లీపర్ క్లాస్‌లో ఆరు బెర్త్‌లు
మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్‌లోని మహిళలకు ఆరు బెర్త్‌లను రిజర్వ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. రాజధాని ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, దురంతో సహా పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో థర్డ్ ఏసీ (3ఏసీ క్లాస్)లో ఆరు బెర్త్‌లు మహిళల కోసం రిజర్వ్ చేస్తున్నట్లు చెప్పారు.

రైలులోని ఒక్కో స్లీపర్ కోచ్‌లో ఆరు లోయర్ బెర్త్‌లు, 3 టైర్ ఏసీ కోచ్‌లో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్‌లు, 2 టైర్ ఏసీ సీనియర్ సిటిజన్‌లలో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్త్‌లు, 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు, గర్భిణీ స్త్రీలకు రిజర్వు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), జీఆర్‌పీ, జిల్లా పోలీసులతో భద్రత కల్పిస్తారు.

చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు!

మరిన్ని వార్తలు