ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వే శాఖ... ఆ రూట్లలో 80 రైళ్లు రద్దు!

1 Oct, 2022 14:08 IST|Sakshi

దసరా పండుగ సీజన్‌ ప్రారంభమైంది. ప్రజలు నగరాలను విడిచి వారి సొంతూర్లకు పయనమవుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లు రద్దీగా మారాయి. ఈ తరుణంలో రైల్వే శాఖ ప్రయాణికులకు భారీ షాక్‌నే ఇచ్చింది. పలు కారణాల వల్ల దాదాపు 80 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది.

అక్టోబర్ 1న బయలుదేరాల్సిన 52 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, 26 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్వహణ, మౌలిక సదుపాయాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

రద్దు చేయబడిన రైళ్ల జాబితాలో లక్నో, వారణాసి, ఢిల్లీ, కాన్పూర్, మరిన్ని నగరాల నుంచి నడిచే రైళ్లు ఉన్నాయి. ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్‌ల ఆటోమేటిక్‌గా రద్దు అవుతుందని, ఆ మొత్తం నగదు వినియోగదారు ఖాతాలలో నేరుగా రీఫండ్ కానుంది.

కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు రీఫండ్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి రిజర్వేషన్ కౌంటర్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

చదవండి: బ్యాంకింగ్‌ బాదుడు.. రెడీగా ఉండండి, ఈ భారం కస్టమర్లదే!

మరిన్ని వార్తలు