ప్రయాణికులకు షాకిచ్చిన భారతీయ రైల్వే!

20 Jul, 2022 16:56 IST|Sakshi

రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది ఐఆర్‌సీటీసీ. ఇకపై రైళ్లలో భోజనం, స్నాక్స్‌ ధరలను ఏకంగా రూ.50 పెంచేసింది. ఈ విషయాన్ని ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ సర్క్యూలర్ కూడా జారీ చేసింది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, డుర్యాంటో ఎక్స్‌ప్రెస్‌లతో సహా భారతీయ ప్రీమియం రైళ్లకు ఈ క్యాటరింగ్ ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది.

భారతీయ రైల్వే బోర్డు జూలై 15న జారీ చేసిన ఆర్డర్ ప్రకారం కొత్త ధరలు ఉంటాయని పేర్కొంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం. ఇకపై ప్రీమియం రైళ్లలో.. అల్పాహారం రూ.105 ఉండగా,  రూ. 155 చేరింది. భోజనం రూ. 185 ఉండగా, రూ. 235, స్నాక్స్‌ రూ. 90 ఉండగా, రూ.140 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో టీ లేదా కాఫీ ముందుగా బుక్‌ చేసుకుంటే రూ. 20, బుక్‌ చేసుకోకుంటే రూ. 70 వసూలు చేసేవాళ్లు. ప్రస్తుతం బుక్‌ చేసినా, చేయకపోయినా వాటి ధరను రూ. 20గా నిర్ణయించారు.

చదవండి: Google Play Store: యాప్‌ డెవలపర్లకు గూగుల్‌ కొత్త రూల్స్‌.. యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసేముందు అలా చేయాల్సిందే!

మరిన్ని వార్తలు