Indian Railways: ఆదాయంలో అదుర్స్‌, కారణాలివే!

12 Sep, 2022 10:54 IST|Sakshi

ఈ ఏడాది ఇప్పటి వరకు 38 శాతం అధికం 

ఇండియన్‌ రైల్వే ఆదాయం రూ.95,487 కోట్లు  

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ఆదాయంలో అదరగొట్టింది. ఈ ఏడాది ఆగస్ట్‌ చివరికి రూ.95,487 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలిస్తే రూ.26,271 కోట్లు (38 శాతం) అధికంగా నమోదైంది. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. 

ప్రయాణికుల రూపంలో వచ్చిన ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలానికి రూ.13,574 కోట్లు రాగా, 116 శాతం వృద్ధితో ఈ ఏడాది రూ.25,277 కోట్లకు చేరింది. రిజర్వ్‌డ్, అన్‌ రిజర్వ్‌డ్‌ విభాగాల్లోనూ వృద్ధి నెలకొంది. బొగ్గు రవాణాతో పాటు ఆహార ధాన్యాలు, ఎరువులు, సిమెంట్, మినరల్ ఆయిల్, కంటైనర్ ట్రాఫిక్ మరియు బ్యాలెన్స్ ఇతర వస్తువుల విభాగాలు ఈ వృద్ధికి ముఖ్యమైన దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సరుకు రవాణా రూపంలో ఆదాయం 20 శాతం వృద్ధితో (రూ.10,780 కోట్లు) రూ.65,505 కోట్లకు చేరింది. 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రైల్వే ఆదాయం రూ.1,91,278 కోట్లుగా ఉండడం  గమనార్హం.

మరిన్ని వార్తలు