Gold Price Hike: బంగారం కొనుగోలుదారులకు షాక్!

15 Sep, 2021 19:03 IST|Sakshi

మీరు బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక షాకింగ్ న్యూస్. బంగారం ధర నేడు భారీగా పెరిగింది. కేవలం ఒక్కరోజులోనే పసిడి ధర రూ.300 పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. న్యూఢిల్లీ బులియన్ జువెలరీ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.47,071 నుంచి రూ.47,382కు పెరిగింది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.300 పైగా పెరిగి రూ.43,402కి చేరుకుంది. 

అయితే, హైదరాబాద్ మార్కెట్లో కూడా పుత్తడి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.44,300గా ఉంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,330గా ఉంది. వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు కేజీ వెండి ధర సుమారు రూ.200 పెరిగి కిలో రూ.63,013కు చేరింది. అంతకుముందు రోజు కిలో రూ.62,883గా ఉన్న సంగతి తెలిసిందే. బంగారం, వెండి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాల చేత ప్రభావం చెందుతాయి.(చదవండి: రైల్వే టికెట్ రద్దు చేస్తే ఇక క్షణాల్లో ఖాతాలో డబ్బులు జమ!)

మరిన్ని వార్తలు