Indian Start-ups: స్టార్టప్‌లకు గడ్డుకాలం..ఈ ఏడాదిలో 60 వేల ఉద్యోగాల కోత!

4 Jul, 2022 16:56 IST|Sakshi

దేశీయ స్టార్టప్‌ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ముమ్మరం చేశాయి. జాతీయ,అంతర్జాతీయ పరిణామాలు, ఆర్ధిక మాంద్యంతో పాటు నిధుల కొరత కారణంగా ఆయా స్టార్టప్‌ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అలా ఈ ఏడాది మొత్తంగా 60వేల మందిని ఇంటికి పంపిచేస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 

దేశ వ్యాప్తంగా ఓలా, బ్లింకిట్‌, వేదాంతు, కార్స్‌ 24, లిడో లెర్నింగ్‌ ఫర్లాంకో వంటి స్టార్టప్‌లలో పనిచేస్తున్న 12వేల మంది ఉద్యోగుల్నివిధుల నుంచి తొలగించాయి. సంస్థల కార్య కలాపాల పేరిట ఈ ఏడాదిలో మరో 50వేల మందిని ఇంటికి పంపనున్నాయి. 


 

మరిన్ని వార్తలు