ఆఫీసులో అరగంట నిద్రపోవచ్చు.. ఆ కంపెనీ వినూత్న నిర్ణయం

5 May, 2022 15:45 IST|Sakshi

ఉద్యోగుల పనితీరు సామర్థ్యం పెంచేందుకు అనేక కంపెనీలు హైబ్రిడ్‌ పని విధానానికి జైకొడుతున్నాయి. బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ ఇంకో అడుగు ముందుకేసి వినూత్న నిర్ణయం తీసుకుంది. పని సమయంలో అరగంట పాడు నిద్రపోవచ్చంటూ ఉద్యోగులకు అవకాశం కల్పించింది.

వేక్‌లిఫ్ట్‌లో స్లీపింగ్‌
బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్‌ సంస్థ పరుపుల తయారీ బిజినెస్‌లో ఉంది. దీని ఫౌండర్‌ చైతన్య రామలింగేగౌడ. ఆయన హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుకుని కొంత కాలం నాసాలో పని చేశారు. గత ఆరేళ్ల నుంచి ఉద్యోగుల పనితీరును గమనించి చైతన్య.. వారి పనితీరు మెరుగు పరిచేంందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

25 నిమిషాలు నిద్రపోతే
అరగంట పాటు ఉద్యోగులకు నిద్ర పోవడానికి అవకాశం కల్పించడంపై చైతన్య మాట్లాడుతూ.. నాసా అధ్యయనాల ప్రకారం మధ్యాహ్నం వేళ 25 నిమిషాల పాటు చిన్న కునుకు తీస్తే ఉద్యోగుల పని సామర్థ్యం 33 శాతం పెరుగుతుందని తేలినట్టు వివరించారు. అంతేకాదు అనవసరపు ఒత్తిడి కూడా తగ్గుతుందని దాని వల్ల పనిలో ఉత్తమ ఫలితాలు వస్తాయంటున్నాడు. మధ్యాహ్నం నిద్ర విషయంలో ఇప్పటికే నిర్ణయం ఆలస్యమైనట్లు వెల్లడించాడు.

అందరి దృష్టి ఇటే
వేక్‌లిఫ్ట్‌కు చెందిన ఉద్యోగులకు ప్రతీ రోజు మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 2:30 గంటల వరకు కునుకు తీసేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆ సంస్థకు చెందిన ఉద్యోగులకు ఈమెయిళ్లు పంపారు. దీంతో ఒక్కసారిగా మధ్యాహ్నం నిద్ర చర్చకు వచ్చింది. మిగిలిన కంపెనీలు, ఉద్యోగులు కూడా ఈ విధానాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.

చదవండి: ఐటీ కంపెనీ ఆఫర్‌: రండి బాబు రండి పెళ్లి సంబంధాలు చూస్తాం, శాలరీలు పెంచుతాం!

మరిన్ని వార్తలు