దేశంలో స్టార్టప్స్‌..7.46 లక్షల మందికి ఉద్యోగాలు!

8 Aug, 2022 14:56 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్‌ వ్యవస్థ ఇప్పటివరకూ 7.46 లక్షల ఉద్యోగాలు కల్పించిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పేర్కొంది. 49 శాతం స్టార్టప్‌లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచే ఉండటం దేశ యువత సామర్థ్యాలకు నిదర్శనమని ఒక అధికారిక ప్రకటనలో వివరించింది. 

తొలి 10,000 అంకుర సంస్థలను గుర్తించేందుకు 808 రోజులు పట్టగా, మలి 10,000 స్టార్టప్‌లకు 156 రోజుల్లోనే గుర్తింపు లభించిందని పేర్కొంది.

ప్రపంచంలోనే అత్యధికంగా రోజుకు 80 అంకుర సంస్థలు గుర్తింపు పొందుతుండటమనేది స్టార్టప్‌ల సంస్కృతికి భవిష్యత్తు ఆశావహంగా ఉండనుందని తెలియజేస్తోందని వివరించింది.

మరిన్ని వార్తలు