లేఆఫ్స్‌ సంక్షోభం: పాప మిస్సింగ్‌.. ఆందోళనలో ఎన్‌ఆర్‌ఐ ఫ్యామిలీ

4 Feb, 2023 20:59 IST|Sakshi
ఫోటో కర్టసీ: న్యూస్‌ మినిట్‌

న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థల్లో ఉద్యోగాల కోత ఆయా కుటుంబాల్లో తీరని క్షోభ మిగిల్చుతోంది. ముఖ్యంగా అమెరికాలో  ఉంటూ ఐటీ  ఉద్యోగం కోల్పోయిన  వారు హెచ్‌1బీ వీసా గడువు ముగిస్తుండటం, 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి లేదా దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితులు మధ్య వారి కష్టాలు వర్ణనాతీతం.  యూఎస్‌లో ఉంటున్న భారతీయ కుటుంబంలో ప్రస్తుతం అలాంటి ఇబ్బందుల్లో పడింది. ఇండియాకు తిరిగి వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయంతో  ఒక బాలిక కనిపించకుండా పోయిన వైనం ఆందోళన  రేపింది. 

న్యూస్‌మినిట్‌అందించిన వివరాల ప్రకారం అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో ఉంటున్న పవన్ రాయ్ మరుపల్లి, శ్రీదేవి దంపతుల కుమార్తె తన్వి (14) గత రెండు వారాలకు పైగా కనిపించకుండా పోయింది. ఎందుకంటే పవన్‌ ఉద్యోగం పోతుందన్న భయంతో, తిరిగి ఇండియాకు వెళ్లి పోవాలని ఆలోచన చేస్తున్నారు. దీనికి భయపడే తన్వి  ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుందని అంచనా.  

తన్వి కోసం స్నేహితులు, బంధువులు ఇతరులు ఎంత శోధించినా ఎలాంటి ఫలితం లేదు. చివరిసారిగా జనవరి 17న బస్సులో పాఠశాలకు బయలు దేరినప్పుడు ఆమె పరిసరాల్లో కనిపించింది. జనవరి 17న కాన్వే జూనియర్ హైస్కూల్‌లో బస్ పికప్ ఏరియా వైపు వెళుతున్నప్పుడు సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలో ఆమె చివరిసారిగా కనిపించిందట. బస్సు ఎక్కుండా, తన్వి డేవిస్ స్ట్రీట్‌లో ఉత్తరాన నడుస్తూ కనిపిస్తోంది. తన్వి తన మొబైల్ , స్మార్ట్‌ఫోన్‌ను ఇంట్లోనే వదిలి వెళ్లడంతో కనుక్కోవడం  మరింత కష్టమని  తెలుస్తోంది. దీంతో ఆమె ఆచూకీ తెలిపిన వారికి  5వేల డాలర్ల నగదు బహుమతి కూడా ప్రకటించారు ఎవరైనా (501) 450-6120లో కాన్వే పోలీస్ డిపార్ట్‌మెంట్ (CPD)ని సంప్రదించాలి లేదా అత్యవసర సేవలను సంప్రదించాలని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు