ఎన్‌ఎస్‌ఈ–ఐఎఫ్‌ఎస్‌సీలో అమెరికా స్టాక్స్‌ ట్రేడింగ్‌ షురూ

4 Mar, 2022 13:43 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎంపిక చేసిన అమెరికన్‌ కంపెనీల స్టాక్స్‌లో భారతీయ రిటైల్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌సీ ఎక్సేంజీలో ట్రేడింగ్‌ లావాదేవీలు ప్రారంభమయ్యాయి. నియంత్రణ సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో కలిసి అన్‌స్పాన్సర్డ్‌ డిపాజిటరీ రిసీట్స్‌ను (యూడీఆర్‌) అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌సీ వెల్లడించింది. 

కస్టోడియన్‌ హోదాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు .. ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌సీ రిసీట్స్‌ను జారీ చేస్తుంది. డిపాజిటరీ ఖాతాలను తెరవడంతో పాటు సంబంధిత ఇతర కార్యకలాపాలను కూడా బ్యాంకు నిర్వహిస్తుంది. గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజీ (ఎన్‌ఎస్‌ఈ) ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ సెంటర్‌ (ఐఎఫ్‌ఎస్‌సీ) ఎక్సేంజీలో ముందుగా అమెజాన్, మెటా ప్లాట్‌ఫామ్స్‌ (ఫేస్‌బుక్‌), ఆల్ఫాబెట్, టెస్లా, నెట్‌ఫ్లిక్స్, యాపిల్, మైక్రోసాఫ్ట్, వాల్‌మార్ట్‌ వంటి 8 స్టాక్స్‌కి సంబంధించిన యూడీఆర్‌లలో ట్రేడింగ్‌కు అవకాశం ఉంటుంది. దీన్ని ఇతర దేశాల స్టాక్స్‌కు కూడా క్రమంగా విస్తరించనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ సీఈవో విక్రమ్‌ లిమాయే తెలిపారు.  
 

మరిన్ని వార్తలు