2021లో దేశంలో ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన మొబైల్ యాప్ ఇదే..!

12 Jan, 2022 17:29 IST|Sakshi

కరోనా మహమ్మారి దెబ్బకు 2020లో చాలా మంది తమ సమయాన్ని ఎక్కువ శాతం మొబైల్‌లోనే గడిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా యాప్ యాన్నీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2021లో కూడా అదే దొరణి కొనసాగింది. 2021లో భారతీయులు మొబైల్‌లో 699 బిలియన్ గంటలకు పైగా సమయాన్ని గడిపారని యాప్ యాన్నీ తాజా స్టేట్ ఆఫ్ మొబైల్ 2022 నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా యాప్ యాన్నీ మొబైల్‌లో గడిపిన మొత్తం సమయం 3.8 ట్రిలియన్ గంటలు. మొబైల్ వినియోగం పరంగా చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది.

ఇన్ స్టాగ్రామ్ @ నెంబర్ వన్
2020 నుంచి 2021 వరకు మొబైల్ వినియోగం స్వల్పంగా తగ్గిన చైనాతో పోలిస్తే ఇది ఎక్కువ అని నివేదిక చూపుతోంది. 2020లో భారతీయులు 655 బిలియన్ గంటల సమయం మొబైల్‌లో గడిపితే, అంతకు ముందు ఏడాది 510 బిలియన్ గంటలు గడిపారు. ఈ గణాంకాలు ఆశ్చర్యకరంగా లేవు, ఎందుకంటే భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గల దేశం. దేశంలో వినోదం, కమ్యూనికేషన్, గేమ్స్ కోసం ఎక్కువ శాతం మంది తమ సమయాన్ని మొబైల్‌లో గడుపుతున్నారు. యాప్ డౌన్‌లోడ్ పరంగా చూసిన భారతదేశం రెండవ స్థానంలో ఉంది. 2021లో గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో 26.7 బిలియన్ డౌన్ లోడ్స్ జరిగాయి. యాప్ యాన్నీ నివేదిక ప్రకారం.. ఇన్ స్టాగ్రామ్ 2021లో భారతదేశంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్ గా నిలిచింది. అత్యధిక సంఖ్యలో నెలవారీ యాక్టివ్ యూజర్లుగా వాట్సప్ యాప్ యూజర్లు నిలిచారు. 

(చదవండి: ఇమ్రాన్‌ ఖాన్‌ కామెడీ.. పాక్‌లో నవ్వులు)

మరిన్ని వార్తలు