ఫారెక్స్‌.. మూడోవారమూ కిందికే 

25 Feb, 2023 04:41 IST|Sakshi

జూన్‌ 17తో ముగిసిన వారంలోభారీగా 6 బిలియన్‌ డాలర్లు డౌన్‌  

ముంబై: భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు (ఫారెక్స్‌) పరిమాణం వరుసగా  మూడో వారం కూడా దిగువముఖంగానే పయనించింది. ఫిబ్రవరి 17తో తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు 5.681  బిలియన్‌ డాలర్లు తగ్గి, 561.267 బిలియన్‌ డాలర్లకు చేరాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.  2021 అక్టోబర్‌లో భారత్‌ ఫారెక్స్‌ నిల్వలు 645 బిలియన్‌ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి.

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ పడిపోకుండా చూసే క్రమంలో రిజర్వ్‌ బ్యాంక్‌ భారీగా డాలర్లు వ్యయం చేయడంతో గరిష్ట స్థాయి నుంచి  100 బిలియన్‌ డాలర్లుకుపైగా పడిపోయాయి. అయితే ఫిబ్రవరి 3కు ముందు వారానికి ముందు 21 రోజుల్లో పురోగతి బాటన పయనించాయి. అటు తర్వాతి వారం నుంచీ నిల్వలు తరుగుదలలో ఉన్నాయి.  వివరాల్లోకి వెళితే.. 

అన్ని విభాగాలూ కిందకే... 
♦   డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ ఫిబ్రవరి 17వ తేదీతో ముగిసిన వారంలో 4.515 బిలియన్‌ డాలర్లు తగ్గి, 496.07 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  
♦    పసిడి నిల్వలు వరుసగా మూడవ వారమూ తగ్తాయి. సమీక్షా వారంలో 1.045 బిలియన్‌ డాలర్లు తగ్గి 41.817 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  
♦    అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) 87 మిలియన్‌ డాలర్లు పెరిగి, 18.267 బిలియన్‌ డాలర్లకు చేరింది. 
♦    ఇక ఐఎంఎఫ్‌ వద్ద     భారత్‌ రిజరŠవ్స్‌ పరిస్థితి 34 మిలియన్‌ డాలర్లు తగ్గి,  5.11 బిలియన్‌ డాలర్లకు చేరింది.   

మరిన్ని వార్తలు