ప్రైమరీ మార్కెట్‌ నుంచి రూ.1.50లక్షల కోట్ల సమీకరణ

27 Jul, 2020 16:27 IST|Sakshi

గతవారంలో రూ.26వేల సమీకరణ పూర్తి

ప్రాథమిక మార్కెట్లో అనూహ్యంగా యాక్టివిటీ పెరగడంతో కంపెనీలు కేవలం 5రోజుల్లో ఆయా మార్గాల్లో దాదాపు రూ.26వేల కోట్ల నిధులను సమీకరించాయి. డెట్‌ విభాగంలో దేశీయ కంపెనీలు భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ఇష్యూ ద్వారా రూ.11వేల కోట్లను సమీకరించాయి. ఈక్విటీ విభాగంలో యస్‌బ్యాంక్‌ ఎఫ్‌పీఓ ఇష్యూ ద్వారా రూ.14750 కోట్ల సేకరణ ప్రక్రియను పూర్తి చేసింది. అలాగే ఐపీఓ ప్రక్రియ ద్వారా కెమికల్స్‌ తయారీ సంస్థ రోసారీ బయోటెక్‌ దాదాపు రూ.500 కోట్లను సమీకరించింది. మైండ్‌స్పేస్‌ పార్క్స్‌ ఆర్‌ఈఐటీ ఐపీఓ సోమవారం ప్రారంభం కానుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ.4,500 కోట్లను సమీరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే వ్యూహాత్మక, యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.2644 కోట్ల నిధులను సమీకరించింది.

వచ్చే 4క్వార్టర్లో రూ.1.50లక్షల కోట్ల సమీకరణ:

వచ్చే 4క్వార్టర్లో ప్రైమరీ మార్కెట్‌ నుంచి బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌ రంగాలకు చెందిన కంపెనీలు దాదాపు రూ.1.50లక్షల కోట్ల నిధుల సమీకరణ జరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభం తర్వాత మార్కెట్లో సానుకూల వాతావరణం పరిస్థితులను వినయోగించుకొని నిధుల సమీకరణ చేపట్టాలని అ‍గ్రశ్రేణి బ్యాంకులు భావిస్తున్నాయి. టైర్‌-1 మూలధన అవసరాలను తీర్చుకోవడం, తగినంత లిక్విడిటీ ఏర్పాటు చేసుకోవడంతో పాటు స్వల్పంగా నెలకొన్న ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కోనేందుకు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు రూ.80వేల కోట్ల నిధుల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్నాయి’’ అని ప్రైమ్‌ డాటాబేస్‌ ఛైర్మన్‌ పృథ్వీ హాల్దియా తెలిపారు.

యస్‌బ్యాంక్‌ ఎఫ్‌పీఓ, రోసారి బయోటెక్‌ ఐపీఓకు లీడ్‌ మేనేజ్‌ సంస్థగా వ్యవహరించే యాక్సిస్‌ క్యాపిటల్‌ ఛైర్మన్‌ సలీల్‌ పాటిల్‌ మాట్లాడుతూ ‘‘ క్యాపిటల్‌ మార్కెట్‌లో ఊహించని విధంగా లిక్విడిటీ పెరిగింది. ఇది ఇష్యూయర్లకు మూలధన్ని పెంచుకునేందుకు, బ్యాలెన్స్‌ షీట్‌ను బలపరుచుకునేందుకు మంచి అవకాశంగా మారింది.’’ అని తెలిపారు. 

మార్కెట్ల ర్యాలీ కంటే నిధుల సమీకరణే ముఖ్యం: 

ఇటీవల సెబీ నిధుల సమీకరణ నియమాలను మరింత సరళతరం చేయడంతో రియలన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎంఅండ్‌ఎం, పీవీఆర్‌ కంపెనీలు రైట్స్‌ ఇష్యూల మార్గాన్ని ఎంచుకున్నాయి. ప్రాథమిక మార్కెట్లో ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి యాక్టవిటీ పెరిగినట్లు మార్కెట్‌ నిపుణులు విశ్వసిస్తున్నారు. స్టాక్‌ మార్కెట్ల ర్యాలీ కంటే మూలధన నిధుల సమీకరణ అవసరమని ఆయా కంపెనీలు భావిస్తున్నాయి. 

ప్రాథమిక మార్కెట్లో దాదాపు 4నెలల విరామం తర్వాత ఈ ఇష్యూలు వచ్చాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న బలహీనతల కారణంగా కొందరు ఇన్వెస్టర్లు ఇప్పటికీ జాగ్రత్త వహిస్తున్నారు. వ్యవస్థలో తగినంత ద్రవ్యత్య లభ్యత ఉన్నందున సెకండరీ మార్కెట్లో షేర్లు ర్యాలీ చేస్తాయి. ద్రవ్య లభ్యత తగినంత లభిస్తున్నందున మూలధన నిధుల సమీకరణకు వచ్చిన ఇష్యూలు విజవంతం అవుతున్నాయి. ఉదాహరణకు రోసారి బయోటెక్‌ ఐపీఓ 79రెట్లు సబ్‌స్క్రైబ్‌ అ‍య్యింది. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ 15వేల కోట్ల లక్ష్యంగా ప్రాథమిక మార్కెట్లోకి రాగా, రూ.11వేలను సమీకరించింది. దేశంలో అతిపెద్ద ఎఫ్‌పీఓ ఇష్యూ 95శాతం సబ్‌స్కైబ్‌ అయ్యింది.

మరిన్ని వార్తలు