అమ్మ బాబోయ్! నిరుద్యోగులుగా మారిన భారతీయులు అంత మందా?

2 Apr, 2023 15:42 IST|Sakshi

2023 ప్రారంభం నుంచి ఎంతోమంది ఉద్యోగులు వివిధ కారణాల వల్ల తమ ఉద్యోగాలను కోల్పోయారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) ప్రకారం, గత మూడు నెలల కాలంలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

భారతీయుల నిరుద్యోగిత రేటు మార్చి నెలలో మునుపటికంటే పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ఎంతోమంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో ఎక్కువ మంది భారతీయులు ఉండటం గమనార్హం. ఈ డేటాను సిఎమ్ఐఈ విడుదల చేసింది. రానున్న రోజుల్లో నిరుద్యోగుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని కూడా స్పష్టం చేసింది.

డిసెంబర్ 2022లో నిరుద్యోగుల రేటు 8.30 శాతం ఉండేది, అయితే ఈ రేటు 2023 జనవరి నాటికి 7.14 శాతానికి చేరుకుంది. ఫిబ్రవరిలో మళ్ళీ 7.8 శాతానికి పెరిగింది. నిరుద్యోగుల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టన ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.

(ఇదీ చదవండి: విడుదలకు ముందే డీలర్ యార్డ్‌లో కనిపించిన మారుతి జిమ్నీ - పూర్తి వివరాలు)

మార్కెట్లో తీవ్ర క్షీణత ఏర్పడిన కారణంగా 2023 మార్చిలో ఎక్కువ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఈ కారణంగా నిరుద్యోగం పెరుగుదల 39.8 శాతానికి చేరిందని CMIE మేనేజింగ్ డైరెక్టర్ 'మహేష్ వ్యాస్' తెలిపారు. అత్యధిక నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రాలలో హర్యానా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత జాబితాలో రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, సిక్కిం, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు