StockMarketOpening: 60వేలను టచ్‌ చేసిన సెన్సెక్స్‌

9 Sep, 2022 14:05 IST|Sakshi

సాక్షి,ముంబై: సానుకూల ప్రపంచ సూచనల మధ్య శుక్రవారం భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి.మిడ్‌సెషన్‌తరువాత లాభాల నుంచి కాస్త వెనక్కి తగ్గినప్పటికీ లాభాల్లో కొనసాగుతున్నాయి.  ఒక దశలో  సెన్సెక్స్‌ 60వేల మార్క్‌ను టచ్‌ చేసింది. ప్రస్తుం సెన్సెక్స్‌154, నిఫ్టీ,  47పాయింట్ల లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి.

టెక్‌ మహీంద్ర, అదానీ పోర్ట్స్‌,  ఇండస్‌ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభ పడుతున్నాయి.  మరోవైపు ఎల్‌ అండ్‌ టీ, ఎం అండ్‌ ఎం, టైటన్‌  ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 26 పాయింట్లు  ఎగిసి 79.50 వద్ద ఉంది. 

మరిన్ని వార్తలు