ఇండిగోకి కొత్త సీఈవో..ఆయన ఎవరంటే!

18 May, 2022 19:20 IST|Sakshi

IndiGo Appoints Pieter Elbers As New CEO: ఇండిగో కొత్త సీఈవోగా పీటర్ ఎల్బర్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2019నుంచి ఇండిగో ఎయిర్‌ లైన్‌ సీఈవో విధులు నిర్వహిస్తున్న రోనోజోయ్‌ దత్ రిటైర్‌ అవుతున్నట్లు ఇండిగో సంస్థ అధికారికంగా ప్రకటించింది. 

2019, జనవరి నెలలో ఇండిగో సీఈవో రోనోజోయ్‌ దత్‌ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా సీఈవో సంస్థను ముందుండి నడిపిస్తున్న రోనోజోయ్‌ దత్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న రిటైర్‌ అవుతున్నట్లు ఇండిగో తెలిపింది.రిటైర్‌ అవుతున్న రంజయ్‌ దత్‌ స్థానంలో కేఎల్‌ఎం రాయిల్‌ డచ్‌ ఎయిర్‌లైన్‌ సీఈవోగా ఉన్న పీటర్ ఎల్బర్స్ ఈ ఏడాది అక్టోబర్‌ 1లోపు బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రతినిధులు తెలిపారు.  

ఈ సందర్భంగా ఇండిగో తనని సీఈవో నియమించడం పట్ల ఎల్బర్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. 16ఏళ్ల క్రితం ఉద్యోగులు,మేనేజ్‌మెంట్ టీమ్‌గా ఏర్పడిన ఇండిగో ఎంతో ఆకట్టుకుందని అన్నారు. అద్భుతమైన పయనంలో తాను భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇండిగో విజన్‌ను నెరవేరుస్తూ, భారత్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రయాణికులకు ఇండిగో సేవల్ని అందుబాటులోకి తెస్తామని పునరుద్ఘాటించారు.

చదవండి👉ఇండిగో ఘటనపై స్పందించిన సీఈవో

మరిన్ని వార్తలు